స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతాం
జూలపల్లి(పెద్దపల్లి): స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. జిల్లా అధ్యక్షుడిగా బాధ్య తలు స్వీకరించిన సంజీవరెడ్డి.. పార్టీ కుద్బుల్లాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి జేకే శేఖర్ యాదవ్‌తో కలిసి పెద్దాపూర్ శ్రీయోగానంద లక్ష్మీనర్సింహుని ఆలయంలో మంగళవారం పూజలు చేశారు. అనంతరం మండల కేంద్రంలో దీన్‌దయాళ్ ఉపాధ్యాయ వర్ధతి సభలో పాల్గొన్నారు. బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతీ కార్యకర్త పట్టుదల, సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కొప్పుల మహేశ్, నాయకులు జ్యోతిబసు, ప్రదీప్‌కుమార్‌గౌడ్, మోహన్‌రెడ్డి, రవీందర్‌గౌడ్, అశోక్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment