సాక్షి, గుంటూరు: ‘‘చంద్రబాబు వచ్చారు.. స్కామ్‌లు, వరదలు తెచ్చారు’’ అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకుంటున్నారని.. ఇది మంచి ప్రభుత్వం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.
‘‘హామీల పేరుతో మోసం చేసినందుకు మంచి ప్రభుత్వం అనాలా?. వరదలతో అనేక మంది ప్రాణాలు బలిగొన్నందుకు మంచి ప్రభుత్వం అనాలా?. మద్యం పాలసీతో దోచుకుంటున్నందుకు మంచి ప్రభుత్వం అనాలా?. టీడీపీ ఎమ్మెల్యేలు ఇసుకను అమ్ముకుంటున్నారు. ఇసుక దోపిడీకి శ్రీకారం చుట్టి ఇసుక ఫ్రీ అని ప్రచారం చేసుకుంటున్నారు. నాణ్యమైన మద్యం అంటే ఏంటి? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా?. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అనే పదం తీసేయండి. నారా వారి సారా పాలన డౌన్ డౌన్ అనే పరిస్థితి ఉంది’ అని అంబటి రాంబాబు దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: తిరుమల లడ్డూ వివాదం: బాబూ నీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకో: వైవీ సుబ్బారెడ్డి
‘‘ఈనాడు, ఆంధ్రజ్యోతి ద్వారా చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు అవలీలగా అబద్ధాలు ఆడుతున్నారు. రామోజీరావు మరణిస్తే ప్రభుత్వం సొమ్ముతో సంతాప సభ పెట్టారు. రూ.4.28 కోట్లు ప్రజల సొమ్ము ఖర్చుపెట్టారు’’ అంటూ అంబటి ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment