AP: పొలిటికల్‌ అప్‌డేట్స్‌ | AP Elections Today Political News Updates And Headlines On Jan 17th In Telugu - Sakshi
Sakshi News home page

AP Political News Jan 17th: పొలిటికల్‌ అప్‌డేట్స్‌

Jan 17 2024 6:51 AM | Updated on Feb 2 2024 7:26 PM

AP Elections Political News Updates Headlines On 17th Jan 2024 In Telugu - Sakshi

AP Elections Political Latest Updates Telugu..

07:30 PM, Jan 17, 2024
నమ్మించి మోసం చేయడం చంద్రబాబు నైజం: దేవినేని అవినాష్‌

  • 2024లో తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేస్తాం 
  • ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటాం 
  • ఈనెల 19వ తేదీన అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్‌ ఆవిష్కరించనున్నారు 
  • తూర్పు నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం
  • అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్‌
  • ఎవరెన్ని ప్రచారాలు చేసినా తూర్పు నియోజకవర్గం కార్యకర్తలు సీఎం జగన్‌ వెంటే ఉంటారు
  • బొప్పన భవకుమార్‌కు పార్టీ ఎలాంటి అన్యాయం చేయలేదు 
  • భవకుమార్‌కు ఎప్పుడూ మేము అండగానే ఉన్నాం 
  • మాతో భవకుమార్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు
  • కేవలం పార్ధసారధితో ఉన్న వ్యక్తిగత పరిచయాల కారణంగానే బొప్పన భవకుమార్ పార్టీని వీడారు 
  • భవకుమార్ అసహ్యించికునే వ్యక్తుల్లో  గద్దె రామ్మోహన్, చంద్రబాబు మొదటి వరుసలో ఉంటారు 
  •  నమ్మించి మోసం చేయడం చంద్రబాబు నైజం 
  • చంద్రబాబు నైజాన్ని త్వరలోనే భవకుమార్ తెలుసుకుంటారు

07:00 PM, Jan 17, 2024
టీడీపీ కార్యకర్తలను మాకు ఓటేయ్యమనే హక్కు మాకుంది: పెద్దిరెడ్డి

  • గతంలో చంద్రబాబు కుప్పానికి నీరు వదిలానని సాష్టాంగ నమస్కారాలు చేశారు.. కానీ నీరు రాలేదు. 
  • గతంలో సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రాకారం కుప్పానికి నీరు అందాయి. 
  • నీరు రావడంతో ప్రతీ గ్రామంలో సంబరాలు చేసుకుంటున్నారు. 
  • గతంలో ఎన్నికల కోసం చంద్రబాబు నటించాడు. 
  • నేడు మనసున్న సీఎంగా వైఎస్‌ జగన్ కుప్పానికి కృష్ణ జాలాల నుండి నీరు అందించారు. 
  • ఈ విషయంలో నాకు కూడా చాలా గర్వంగా ఉంది.
  • అట్టడుగు, బలహీన వర్గాల నుండి అందరికీ సంక్షేమ పథకాలు, అభివృద్ధితో మాకు ధైర్యాన్ని ఇచ్చారు
  • తెలుగుదేశం కార్యకర్తలను కూడా ఓటు వెయ్యమని అడిగే హక్కు మాకుంది.
  • కానీ చంద్రబాబుకి ఆ ధైర్యం లేదు.
  • గతంలో  టీడీపీలో కావల్సిన వారికే సంక్షేమ పథకాలు అందించారు
  • నేడు సీఎం జగన్ కుల, మత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించారు.
  • ఎన్ని పార్టీలు ఏకమైనా మాకు ఏం భయం లేదు.
  • రాబోయే ఎన్నికల్లో మళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయం సాధిస్తుంది.
  • ఈనెల 19న అంబేద్కర్‌ విగ్రహాన్ని సీఎం జగన్‌ ఆవిష్కరిస్తారు. 
  • ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అట్టగువర్గాల  ప్రజల ఆత్మగౌరవం, మనోభావాలను గౌరవించేలా విగ్రహం ఏర్పాటు. 
     

06:30 PM, Jan 17, 2024
టికెట్ల కేటాయింపులో సీఎం జగన్ ముందంజలో ఉన్నారు

  • టీడీపీ నేత తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి
  • చెబుతా.. చెబుతా.. అంటూ చంద్రబాబు సాగదీస్తున్నారు.
  • నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తే పనిచేయటానికి వీలవుతుంది.
  • చాలా మంది రాజకీయ నేతలు ఓటర్లను వెధవలుగా భావిస్తున్నారు.
  • టికెట్ కేటాయిస్తేనే.. నియోజకవర్గంలో తిరుగుతానన్న భావన సరికాదు.

06:00 PM, Jan 17, 2024
చంద్రబాబుకు విజయవాడ పట్ల చిత్తశుద్ధిలేదు: కేశినేని నాని

  •  నేను టీడీపీలో ఉంటూనే చంద్రబాబు నమ్మదగిన వ్యక్తి కాదని దేవినేని అవినాష్‌కు చెప్పా.
  • తండ్రి ఆశయం కోసం కష్టపడుతున్న వ్యక్తి అవినాష్.
  • తూర్పు నియోజకవర్గానికి అవినాషే సరైన వ్యక్తి.
  • చంద్రబాబు వంద కోట్లు కూడా బెజవాడకు కేటాయించలేదు.
  • చెన్నై తరహాలో ఫ్లై ఓవర్లు ఏర్పాటు చేయాలనుకుంటే ..బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్‌ను చంద్రబాబు చెడగొట్టాడు.
  • నేషనల్ హైవే అథారిటీస్ రికార్డుల్లో కూడా ఈ విషయం ఉంటుంది.
  • స్టామ్ వాటర్ డ్రైనేజ్ కోసం 460 కోట్లు కేంద్రం నుంచి తెస్తే.. అప్పటి మంత్రి నారాయణతో చెప్పి హెల్త్ డిపార్ట్ మెంట్‌కు తరలించాడు.
  • నటనను చంద్రబాబు దగ్గర చూశాం.
  • నిజాయితీని జగన్ మోహన్ రెడ్డి దగ్గర చూశాం.
  • పార్టీ పరంగా వైఎస్సార్‌సీపీకి ఉన్న బలంలో 10 శాతం కూడా టీడీపీకి లేదు.
  • ఈనాడు.. జ్యోతి.. టీవీ5ని నమ్మొద్దు. 
  • సర్వేలన్నీ వైఎస్సార్‌సీపీవైపే ఉన్నాయ్.
  • భారీ మెజార్టీతో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వస్తున్నారు.
  • తూర్పులో అవినాష్,మూడవ సారి ఎంపీగా నేను విజయం సాధిస్తాం

03:45 PM, Jan 17, 2024
తెనాలి టికెట్‌పై పొలిటికల్‌ వార్‌

  • తెనాలి టికెట్‌ వ్యవహారంలో పీక్‌ స్టేజ్‌కు టీడీపీ-జనసేన మధ్య వార్‌
  • ఇప్పటికే ఆఫీస్‌ ప్రారంభించి నాదేండ్ల మనోహర్‌ హడావుడి
  • టికెట్‌ తనదేనంటూ పాదయాత్ర చేపట్టిన ఆలపాటి రాజేంద్రప్రసాద్‌
  • మరోవైపు, నియోజకవర్గ టీడీపీ అత్యవసర సర్వసభ్య సమావేశం
  • తెనాలి టికెట్‌ తమకే ఇవ్వాలని టీడీపీ కార్యకర్తలు, నేతల నినాదాలు
  • జనసేనకు వేరే చోట టికెట్‌ ఇవ్వాలని తేల్చి చెబుతున్న టీడీపీ నేతలు
  • టీడీపీ సమావేశానికి హాజరు కానున్న ఆలపాటి.

02:45 PM, Jan 17, 2024
చంద్రబాబు శేష జీవితం సెంట్రల్‌ జైల్లోనే: ఎమ్మెల్యే రాచమల్లు

  • టీడీపీ హయాంలో చంద్రబాబు ప్రజాధనాన్ని స్వాహా చేశారు. 
  • కేసు నమోదైన నాటి నుంచి నేరం తాను చెయ్యలేదని చంద్రబాబు అనడం లేదు. 
  • చంద్రబాబుపై కేసు నమోదు, రిమాండ్‌ చట్టబద్దతే కలిగినవే. 
  • బాబు శేష జీవితం సెంట్రల్‌ జైలులోనే గడపక తప్పదు


02:20 PM, Jan 17, 2024

జనం మెచ్చిన నేత సీఎం జగన్‌: మంత్రి ఆదిమూలపు 

  • పేదరికం విద్యకు అడ్డుకాకూడదు. 
  • అంబేద్కర్‌ ఆలోచనలకు అనుగుణంగా సీఎం జగన్‌ పాలన సాగుతోంది. 
  • బడుగు, బలహీన, అణగారిన, దళిత వర్గాలకు సీఎం జగన్‌ పెద్దపీట వేశారు. 
  • అవినీతిలేని పాలన, పారదర్శకత, జవాబుదారీతనం మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలు. 
  • నేను ఉన్నాను.. నేను విన్నానని పాదయాత్రలో ప్రజల కష్టాలను సీఎం జగన్‌ తెలుసుకున్నారు. 
  • ఈ నాలుగున్నరేళ్లలో సీఎం జగన్‌ అండగా నిలిచారు. 
     

02:00 PM, Jan 17, 2024
చంద్రబాబు దోషే.. శిక్ష తప్పదు: మంత్రి కాకాణి

  • చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ సక్రమమే అని సుప్రీంకోర్టు కూడా చెప్పింది.
  • చంద్రబాబు విషయంలో జరగాల్సిన ప్రక్రియ మొత్తం చట్టపరంగా, న్యాయపరంగా జరిగింది
  • జరిగిన స్కామ్, దాని తీవ్రతను బట్టి చంద్రబాబు జైలుకి వెళ్లడానికి అర్హుడేనని జస్టిస్ బేలా త్రివేది తెలిపారు
  • ఈ కేసులో చంద్రబాబు దోషే ఈ కేసుని క్వాష్ చేయటం లేదని ప్రాథమికంగా సుప్రీంకోర్టు తేల్చింది
  • చంద్రబాబు దోషే శిక్ష తప్పదు

01:22 PM, Jan 17, 2024
అంబేద్కర్ విగ్రహం పెడతానని చంద్రబాబు మోసం: మంత్రి మేరుగ నాగార్జున

  • గత పాలనలో అవమానాలు.. అవహేళనలు.. దాడులు.. చూశాం.
  • సీఎం జగన్‌ వల్లే మేం రాజ్యాధికారం పొందగలిగాం
  • విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం పెడతానని సీఎం చెప్పారు
  • చెప్పినట్లుగానే రూ. 425 కోట్లతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు
  • సమాజంలో ఉన్న అసమానతలను తొలగించేందుకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్‌
  • ఆయన భావజాలాన్ని భుజాన వేసుకుని పాలన చేస్తున్న ఒకే ఒక్కడు సీఎం జగన్‌
  • అంబేద్కర్ ఆలోచనలతో పాలన చేస్తూ చరిత్ర పుటల్లో సీఎం జగన్‌ తన పేరు లిఖించుకున్నారు
  • సీఎం జగన్‌ భావితరాల భవిషత్తు కోసం పనిచేస్తున్నారు

12:35 PM, Jan 17, 2024
కొడుకు భవిష్యత్తుకు గ్యారెంటీ కోసమే చంద్రబాబు కుట్ర: ఎంపీ మార్గాని భరత్‌

  • సెంటర్ జైలు నుంచి షూరిటీపై బయటకొచ్చిన చంద్రబాబు భవిష్యత్తుకు గ్యారెంటీ ఎలా ఇస్తారు
  • టీడీపీ-జనసేన మేనిఫెస్టో అమలుకు లక్ష కోట్ల రూపాయలు అవసరం
  • సంపద ఎలా సృష్టిస్తారో చంద్రబాబు సమాధానం చెప్పాలి
  • పెన్షన్,  జీతాలు ఎలా చెల్లిస్తారు
  • కొడుకు భవిష్యత్తుకు గ్యారెంటీ కోసమే చంద్రబాబు కుట్ర
  • 2014లో టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ఎందుకు అమలు చేయలేదు
  • 2014 మేనిఫెస్టోను టీడీపీ ఎందుకు వెబ్‌సైట్‌ నుంచి తొలగించింది
  • చంద్రబాబే అవినీతి తిమింగలం అని మరోసారి నిగ్గు తేలింది 
  • రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న షర్మిల మరోసారి ఆలోచించుకోవాలి
  • రాష్ట్ర విభజనలో ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధులు కేటాయింపుల్లో కాంగ్రెస్ తీరని అన్యాయం చేసింది
  • నాడు వైఎస్సార్, నేడు సీఎం జగన్‌ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేసి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు

11:58 AM, Jan 17, 2024
సుప్రీం కోర్టుకు పాదాభివందనం: బహుజన పరిరక్షణ సమితి

  • అవినీతి కేసుల్లో చంద్రబాబును అరెస్టు చేయడం సబబే అంటూ తీర్పిచ్చిన అత్యున్నత న్యాయ స్థానానికి పాదాభివందనాలు
  • చేయాల్సిన తప్పులన్నీ చేసిన చంద్రబాబు వ్యవస్థలను సైతం మోసం చేసేందుకు లక్షల కోట్లు వెచ్చించి న్యాయవాదులను పెట్టుకొని స్క్వాష్‌ పిటిషన్‌ వేయడం న్యాయస్థానాలను తప్పుదారి పట్టించేందుకు కాదా?
  • ఆధారాలతో సహా దొరికిన చంద్రబాబు తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు చేయని దొడ్డిదారి యత్నాలు లేవు
  • కానీ న్యాయస్థానం ఎదుట ఎవరైనా ఒకటే
  • నేడు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం
  • వంద గొడ్లు తిన్న రాబందు ఒక్క గాలివానకు కొట్టుకెళ్ళినట్లు..
  • బాబుపై వచ్చిన తీర్పు పట్ల యావత్‌ దేశంలో అవినీతిపరుల వెన్నులో వణుకు పుట్టిస్తుందనడంలో సందేహం లేదు
  • అమరావతి పేరుతో ఈ ప్రాంతాన్ని నిలువునా దోచేందుకు సింగపూర్‌ మంత్రులు, కంపెనీలతో కుమ్మక్కై భారీ అవినీతికి తెరలేపిన బాబు
  • పూర్తి స్థాయిలో విచారణ జరిపితే మరింత భారీ కుంభకోణాలు బయటకు వచ్చే అవకాశం

10:37 AM, Jan 17, 2024
చంద్రబాబుకు శిక్ష తప్పదు: ఏపీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి 

  • అవినీతికి పాల్పడిన బాబు.. చట్టానికి ఎవరూ అతీతులు కారు
  • సుప్రీంలో అనుకూలంగా ఉత్తర్వులు రావడం హర్షణీయం
  • చంద్రబాబు అధికారంలో ఉండగా కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారు
  • వాటికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది
  • ఇప్పటికే చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించడంతో జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చారు
  • చంద్రబాబుపై పలు కేసులు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నాయి
  • రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వస్తుండడం హర్షణీయం
  • చంద్రబాబుపై కేసులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిరంతరం పోరాటం చేస్తా
  • అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడిన చంద్రబాబు
  • ఆయన కుమారుడు లోకేశ్‌లకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది
  • ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎన్నికల హామీలను ఎవరూ నమ్మొద్దు  

10:04 AM, Jan 17, 2024
బాబు అవినీతిపై టీడీపీ సైలెన్స్‌!

  • 2019లో రూ.150 కోట్లు తీసుకున్నారని రాయపాటి రంగారావు ఆరోపణ
  • పోలవరం ప్రాజెక్టు పేరుతో బాబు, లోకేశ్‌ వారం వారం డబ్బు వసూలు చేశారని వెల్లడి 
  • అమరావతి జేఏసీ డబ్బు వసూలు చేశారని మరో ఆరోపణ
  • లెక్కలు చెప్పాలన్న రాయపాటి 
  • నోరు మెదపని చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలు
  • తాము చేసిన అవినీతిపై మాట్లాడితే తమకే మరింత నష్టం వస్తుందన్న ఆలోచనతో వారంతా సైలెంట్‌
  • ఇంత పెద్ద అవినీతి ఆరోపణలపై టీడీపీ, చంద్రబాబు, లోకేశ్‌ నుంచి సమాధానం రాలేదు.
  • వారు మౌనంగా ఉండటంతో డబ్బులు వసూలు చేసిన మాట నిజమేనని తెలుగుతమ్ముళ్లు సైతం అభిప్రాయం

09:31 AM, Jan 17, 2024
ఇసుక బకాసురుడు బాబు 

  • ఇసుక ఉచితమంటూ ఊడ్చేశారు
  • పచ్చ ముఠా లూటీ రూ.10 వేల కోట్లు.. గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నిబంధనలు బేఖాతర్‌ 
  • ఆర్థిక శాఖ ఆమోదం, మంత్రి మండలి తీర్మానం లేదు 
  • ‘ప్రత్యేక మెమో’ ముసుగులో యథేచ్ఛగా దోపిడీ
  • ఏ1 పీతల సుజాత, ఏ 2 చంద్రబాబు, ఏ 3 చింతమనేని, ఏ 4 దేవినేని ఉమా
  • టీడీపీ హయాంలో ‘ఉచిత ఇసుక విధానం’ ముసుగులో పచ్చ ముఠా దోపిడీ
  • పూర్తి ఆధారాలతో సహా బట్టబయలు చేసిన సీఐడీ
  • కేంద్ర చట్టాలు, గ్రీన్‌ ట్రిబ్యు­నల్‌ విధివిధానాలను ఉల్లంఘించి కేబినెట్‌ ఆమో­దం కూడా లేకుండా ‘ప్రత్యేక మెమో’ ద్వారా చంద్రబాబు లూటీ
  • 2016 నుంచి 2019 వరకు ప్రభుత్వ ఖజానాకు రూ.వెయ్యి కోట్ల ఆదాయానికి గండి
  • చంద్రబాబు ముఠా ఏకంగా రూ.10 వేల కోట్ల విలు­వైన ఇసుక దోపిడీ

08:36 AM, Jan 17, 2024
ఇక ఫైబర్‌ నెట్‌ కేసు.. ఉత్తర్వులపై ఉత్కంఠ!

  • ఫైబర్ నెట్ కేసు.. నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ
  • నేడు మధ్యాహ్నం 3 గంటలకు బెయిల్‌ పిటిషన్‌పై విచారించనున్న సుప్రీంకోర్టు
  • విచారణ చేయనున్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం
  • అవినీతి నిరోధక చట్టం 17A వర్తింపు పై  భిన్నమైన తీర్పుల నేపథ్యంలో కేసు విచారణపై ఆసక్తి
  • స్కిల్‌ కేసు క్వాష్‌ పిటిషన్‌పై ఈ ధర్మాసనమే నిన్న భిన్న తీర్పులు ఇచ్చిన సంగతి తెలిసిందే

ఫైబర్‌ నెట్‌ కేసు నేపథ్యం.. 

  • సీఎం ఉన్న సమయంలో ఫైబర్‌నెట్‌ కుంభకోణం ద్వారా చంద్రబాబు రూ.114 కోట్లకుపైగా ప్రజాధనాన్ని లూటీ చేశారన్నది సీఐడీ ప్రధాన అభియోగం.
  • 2021లో ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ ఎండీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు
  • టీడీపీ ప్రభుత్వంలో 2015 సెప్టెంబర్‌ నుంచి 2018 వరకు ఈ కుంభకోణం జరిగిందని చెబుతున్న సీఐడీ
  • మొత్తం రూ.2 వేల కోట్ల ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో రూ.333 కోట్ల విలువైన పనులు
  • నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు, లోకేశ్‌లకు సన్ని­హి­తు­డైన వేమూరి హరికృష్ణ ప్రసాద్‌కు చెందిన ‘టెరా సాఫ్ట్‌’ కంపెనీకి టెండర్లు కట్టబెట్టారు
  • చంద్ర­బాబు విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖలను తన వద్దే అట్టి­పెట్టుకున్నారు
  • వాస్తవానికి ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టును ఐటీ శాఖ చేపట్టాలి
  • కానీ ఈ ప్రాజెక్టును విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టు­బడుల శాఖ చేపడుతుందని అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నిర్ణయం

07:44 AM, Jan 17, 2024
వైఎస్సార్‌సీపీని వీడే ప్రసక్తే లేదు: నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి

  • పార్టీ నెల్లూరు రూరల్‌ అభ్యర్థిగా పోటీ చేస్తా
  • కిరాయి మూకలతో నాపై దుష్ప్రచారం
  • అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానేగానీ ఎట్టిపరిస్థి­తుల్లోనూ పార్టీ మారే ప్రసక్తే లేదు
  • తాను పార్టీ మారుతున్నట్లు విపక్షాలు, రాజకీయ ప్రత్యర్థులు దుష్ప్రచారంపై ఆగ్రహం
  • తాను టీడీ­పీ అధిష్టానా­న్ని కలి­సినట్లు, ఆ పార్టీ­లో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన ఎంపీ ఆదాల
  • వైఎస్సార్‌సీపీలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదు
  • ఎంపీ టికెట్‌ ఇవ్వడంతో గెలిచి సేవలు అందించా
  • నెల్లూ­రు రూరల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించి పార్టీ తగిన గుర్తింపునిచ్చింది
  • ఇంత ప్రాధాన్యం ఇస్తున్న వైఎస్సార్‌సీపీని వదిలి వెళ్లాల్సిన అవసరం తనకు లేదు
  • రాజకీయంగా తనను ఎదుర్కొనే సత్తా లేక కొందరు కిరా­యి మూకలను నియమించుకుని దుష్ప్రచారం
  • రూరల్‌ నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ అత్యంత బలంగా ఉండటంతో ఇలాంటి కుట్రలు పన్నుతున్నారు
  • వీటిని ప్రజలు నమ్మే పరి­స్థితి లేదు
     

07:28 AM, Jan 17, 2024
బాబుపై స్కిల్‌ కేసును కొట్టేయలేం 

  • ఈ కేసులో రాజకీయ దురుద్దేశాలు, కక్ష సాధింపులు లేవు 
  • సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ సరైనదే... దాన్ని కొట్టేయాలనటం సరికాదు: సుప్రీంకోర్టు
  • చంద్రబాబును జైలుకు పంపడం సమర్థనీయమే 
  • ముందస్తు అనుమతి లేదనే కారణంతో రిమాండ్‌ ఉత్తర్వుల్ని కొట్టేయలేం 
  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో సుప్రీంకోర్టు విస్పష్ట తీర్పు 
  • సెక్షన్‌ 17(ఏ) వర్తింపుపై ఇరువురు న్యాయమూర్తులు భిన్న తీర్పులు 
  • అది వర్తిస్తుందని ఒకరు.. ఈ కేసుకు వర్తించదని మరొకరు తీర్పు 
  • దీంతో ముగ్గురు సభ్యులుండే విస్తృత ధర్మాసనానికి ఈ అంశం 
  • సెక్షన్‌ 17(ఏ) వర్తించేది అవినీతి నిరోధక చట్టానికి మాత్రమే 
  • సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లో... ఐపీసీ 409, 120బి కింద కూడా బాబుపై కేసులు 
  • సుప్రీం తీర్పుతో వాటితో ముందుకెళ్లడానికి సీఐడీకి పచ్చజెండా...
  • దీన్లో సెక్షన్‌ 409 కింద నేరం రుజువైతే బాబుకు యావజ్జీవ ఖైదు 
  • సెక్షన్‌ 17ఏపై తేల్చడానికి విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్న సీజేఐ 
  • సుప్రీంకోర్టు టాప్‌ 4 సీనియర్‌ జడ్జిల్లో ఒకరి నేతృత్వంలో విస్తృత ధర్మాసనం 
  • ఆ సీనియర్‌ న్యాయమూర్తి ఎవరి తీర్పును సమర్దిస్తే... 17ఏపై ఆ తీర్పే ఖరారు 
  • సెక్షన్‌ 17ఏతో సంబంధం లేకుండా తొలిసారి బోనెక్కనున్న చంద్రబాబు 
  • ఎన్నో కేసుల్లో సాంకేతిక కారణాలతో బయటపడ్డ బాబు 
  • చాలా కేసుల్లో ‘మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌’.. ఈ సారి పారని పాచిక 

07:11 AM, Jan 17, 2024
'స్కిల్‌' దొంగ బాబే

  • ప్రాజెక్ట్‌ రూపకల్పన నుంచి నిధులు కొల్లగొట్టడం వరకు అంతా ఆయనే 
  • కుట్రదారు, లబ్ధిదారు చంద్రబాబే 
  • సీమెన్స్‌ కంపెనీకి తెలియకుండానే ప్రాజెక్ట్‌ 
  • రూ.370 కోట్ల ప్రాజెక్ట్‌ రూ.3,300 కోట్లకు పెంపు 
  • తన ముఠాను మోహరించి అడ్డగోలుగా లూటీ 
  • సీఐటీడీ నివేదిక ఇవ్వక మునుపే డిజైన్‌ టెక్‌కు నిధులు  
  • ఉన్నతాధికారులు వద్దన్నా బేఖాతరు 
  • ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా దర్యాప్తు 
  • అన్ని ఆధారాలు సంపాదించి కోర్టు ముందుంచిన సీఐడి 
  • అందుకే చంద్రబాబుకు రిమాండ్‌.. జైల్లో 52 రోజులు 

07:08 AM, Jan 17, 2024
చంద్రబాబుపై ఆలపాటి తిరుగుబాటు

  • తెనాలి సీటు జనసేనకు కేటాయింపుపై ఆగ్రహం 
  • మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధంగా తెనాలి టీడీపీ నేతలు 
  • జనసేనకు తెనాలి సీటు ఇవ్వొద్దని గతంలోనే కోరిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ (రాజా)
  • తెనాలి సీటు విషయంలో జన­సేన, తెలుగుదేశం మధ్య రాజుకున్న చిచ్చు 
  • నేడు గుంటూరులో అత్యవసర సమావేశం

06:59 AM, Jan 17, 2024
‘ఉమ్మడి’గా మాయ!

  • 2014లో రాష్ట్ర ప్రజలను ఉమ్మడిగా వంచించిన చంద్రబాబు, పవన్‌ 
  • 600కు పైగా హామీలతో మేనిఫెస్టో విడుదల.. అందులో చంద్రబాబుతో పాటు పవన్‌ ఫొటో కూడా.. 
  • చంద్రబాబు సీఎం అయ్యాక హామీలన్నీ బుట్ట దాఖలు.. ఒక్క హామీ సక్రమంగా అమలు చేయకుండా ప్రజలను నిలువునా వంచించిన ద్వయం 
  • రుణమాఫీ పేరుతో రైతులు, మహిళలను మోసం చేసిన వైనం 
  • జాబుల పేరుతో యువతకు టోకరా 
  • పింఛన్లు ఇవ్వడానికీ వృద్ధులు, దివ్యాంగులను తిప్పలు పెట్టిన ఘనులు 
  • చివరకు మేనిఫెస్టోనే వెబ్‌సైట్‌ నుంచి తొలగించేశారు.. ఇప్పుడు మళ్లీ ఇద్దరూ కలిసి మాయ చేసేందుకు యత్నం 
  • ఉమ్మడి మేనిఫెస్టో, కార్యక్రమాలు అంటూ ప్రజల ముందుకు 

06:55 AM, Jan 17, 2024
బాబుకు ఇది భారీ భంగపాటే

  • సుప్రీంకోర్టు తీర్పుపై న్యాయనిపుణులు
  • ఇక ఈ కేసు నుంచి తప్పించుకోవడం అసాధ్యం
  • రిమాండ్‌ సబబే, విచారణ కొనసాగుతుంది
  • ఈ కేసుకు ఎలాంటి రాజకీయ కక్షను ముడిపెట్టలేం
  • రిమాండ్‌ను తప్పుపట్టలేమని సుప్రీంకోర్టు స్పష్టం చెప్పింది
  • ఈ కేసులో నేరం జరిగింది, నిధుల మళ్లింపు జరిగింది, విశ్వాస ఘాతుకం చోటు చేసుకుంది
  • అరెస్ట్‌పై అభ్యంతరాన్ని లేవనెత్తుతూ కేసు కొట్టేయాలన్న వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది

06:48 AM, Jan 17, 2024
టీడీపీ మెడకు చుట్టుకున్న స్కిల్‌ స్కాం

  • చంద్రబాబు కేసుతో ఇరుకునపడ్డ తెలుగుదేశం
  • ఎన్నికల ముందు పెద్దషాక్‌ తగిలిందని టిడిపి నేతల అంతర్మథనం
  • కేసు కొట్టేస్తారన్న ఊపులో భారీ ర్యాలీలు జైలు నుంచి చేశామని ఆవేదన
  • ఇంత చేసినా.. రిమాండ్‌ సరైందని కోర్టు చేప్పిందని టిడిపి నేతల ఆందోళన

సుప్రీంకోర్టు ఏం చెప్పింది.?

  • చంద్రబాబు అరెస్టు, రిమాండ్ విషయంలో జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు
  • అవినీతి నిరోధక కేసుల్లో గవర్నర్ అనుమతి అవసరం అన్న జస్టిస్ అనిరుద్ధ బోస్
  • అయితే ఐపీసీ సెక్షన్ల నమోదు చేసిన అభియోగాలు కొనసాగుతాయని స్పష్టం చేసిన జస్టిస్ బోస్
  • గవర్నర్ అనుమతి తీసుకొని అవినీతి నిరోధక చట్టం కూడా అమలు చేయవచ్చన్న జస్టిస్ బోస్
  • జస్టిస్ అనిరుద్ధ బోస్ అభిప్రాయంతో విభేధించిన జస్టిస్ బేలా త్రివేది
  • చంద్రబాబు కేసులో 17ఏ అవసరం లేదు, అది వర్తించదన్న జస్టిస్ బేలా త్రివేది
  • స్కిల్ స్కాంలో చంద్రబాబును ఐపీసీ, పీసీ యాక్ట్ రెండింటి ప్రకారం విచారించాల్సిందే అన్న జస్టిస్ బేలా త్రివేది
  • భిన్న అభిప్రాయాల నేపధ్యంలో కేవలం 17ఏ వర్తిస్తుందా లేదా అనే విషయాన్ని తేల్చడానికి… సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు నివేదన
  • చంద్రబాబు అరెస్టు, రిమాండ్ సమర్ధించిన ఇద్దరు న్యాయమూర్తులు… చంద్రబాబుకు ఊరట ఇవ్వడానికి నిరాకణ
  • చంద్రబాబు అరెస్టు విషయంలో సీఐడీ తీసుకున్న నిర్ణయాలను సమర్ధించిన ఇద్దరు న్యాయమూర్తులు
  • రిమాండ్ విషయంలో ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని పూర్తిగా సమర్ధించిన ఇద్దరు న్యాయమూర్తులు
  • చంద్రబాబు అరెస్టు విషయంలో ఎలాంటి రాజకీయ కక్ష్య సాధింపు లేదని స్పష్టం చేసిన ఇద్దరు న్యాయమూర్తులు
  • చంద్రబాబు అరెస్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదని ఇద్దరు న్యాయమూర్తుల స్పష్టీకరణ
  •  స్కిల్ స్కాం కేసులో సీఏం హోదాలో చంద్రబాబు అవినీతి, నమ్మక ద్రోహం పాల్పడినట్లు తీవ్రమైన అభియోగాలున్నాయన్న ఇద్దరు న్యాయమూర్తులు
  • చంద్రబాబు అరెస్టు, రిమాండ్ విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయం చట్ట ప్రకారమే ఉందన్న ఇద్దరు న్యాయమూర్తులు
  • 17ఏ వర్తింపు విషయంలో ఒక న్యాయమూర్తి అనుకూలంగా మరో న్యాయమూర్తి వ్యతిరేకమైన అభిప్రాయం
  • చంద్రబాబుపై ఉన్న అభియోగాలను కొట్టేసేందుకు నిరాకరించిన ఇద్దరు న్యాయమూర్తులు
  • గవర్నర్ అనుమతి తీసుకుని పీసీ యాక్ట్లో సైతం విచారణ చేయవచ్చన్న జస్టిస్ అనిరుద్ధ బోస్
  • రాజకీయ కక్ష్య సాధింపు అని చంద్రబాబు చేసిన ఆరోపణలను కొట్టి పారేసిన ఇద్దరు న్యాయమూర్తులు
  • ఎలాంటి ఆధారాలు లేవన్న చంద్రబాబు వాదనను తొసిపుచ్చిన ఇద్దరు న్యాయమూర్తులు
  • స్కిల్ స్కాంలో సెక్షన్ 409 ప్రకారం చంద్రబాబును విచారించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
  • సెక్షన్ 409 ప్రకారం నేరం రుజువైతే చంద్రబాబుకు జీవితఖైదు శిక్షపడే అవకాశం
  • సెక్షన్ 409ను కొట్టేయాలని చంద్రబాబు చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఇద్దరు న్యాయమూర్తులు
  • సెక్షన్ 120బీ కొనసాగుతుందని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
  • సెక్షన్ 10బీ ప్రకారం నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని చంద్రబాబుపై పెట్టిన అభియోగాలను కొట్టేయడానికి నిరాకరించిన ఇద్దరు న్యాయమూర్తులు
  • చంద్రబాబుపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేసేందుకు నిరాకరించిన ఇద్దరు న్యాయమూర్తులు
  • చంద్రబాబును విచారించేందుకు పూర్తి ఆధారాలున్నాయని అభిప్రాయపడ్డ సుప్రీంకోర్టు
  • స్కిల్ స్కాంలో చంద్రబాబును విచారించేందుకు ఏసీబీ కోర్టుకు విచారణ పరిధి ఉందని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
  • ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించడం సబబే అన్న ఇద్దరు న్యాయమూర్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement