యాచారం: కేసీఆర్ ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోందని, సర్కార్ కారణంగానే తమ కార్యకర్త గంగళ్ల శ్రీనివాస్ మృతి చెందాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలోనిగూడ గ్రామానికి చెందిన గంగళ్ల శ్రీనివాస్ ఈ నెల 1న పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. శుక్రవారం తమ్మలోనిగూడలో నిర్వహించిన శ్రీనివాస్ అంత్యక్రియల్లో సంజయ్ పాల్గొని నివాళుల ర్పించారు. ఆయన మాట్లాడుతూ వందలాది మంది ఆత్మబలిదానాలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే నేడు కేసీఆర్ కుటుంబం అధికారం చెలాయిస్తోందని అన్నారు. ఆత్మబలిదానాలు వద్దు.. అధికారమే లక్ష్యంగా బీజేపీ శ్రేణులు పోరాడాలన్నారు.
సైనికుల్లా పనిచేయాలి: డీకే అరుణ
తెలంగాణలో గడీల పాలన నడుస్తోందని, టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని అంతమొందించేందుకు పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. శ్రీనివాస్ అంత్యక్రియల్లో ఆమె పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment