సాక్షి, తిరుపతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సీరియస్ అయ్యారు. వినతిపత్రం పేరుతో తిరుపతికి పవన్ దండయాత్రకు వస్తున్నట్టు ఉంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాగా, భూమన కరుణాకర్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక నగరం తిరుపతిపై పవన్ దాడికి దిగుతున్నట్టు ఉంది. వినతిపత్రం పేరుతో పవన్ దండయాత్రకు వస్తున్నట్టు ఉంది. ప్రజాస్వామ్యబద్దంగా ఉన్న మా పార్టీపై నిత్యం నిందలు వేస్తున్నాడు. పవన్.. తనకు ఓటు వేస్తే ఏం చేస్తాడో చెప్పకుండా నిత్యం పగ, ప్రతీకారాలతో భీష్మ ప్రతిజ్ఞలు చేస్తున్నాడు. నేను అనేది తప్పా.. మేము అనేది లేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: గ్రేట్ ఇండియన్ బ్రాండ్ అరకు కాఫీ..
Comments
Please login to add a commentAdd a comment