సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో బీజేపీ స్పీడ్ పెంచింది. కీలక నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు.. ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో నవంబర్ 12 లేదా 13వ తేదన విడుదలయ్యే అవకాశం ఉంది.
బీజేపీ మేనిఫెస్టోలో కీలక అంశాలను చేర్చినట్టు సమాచారం. ముఖ్యంగా తెలంగాణలో పలు నగారాలకు పాత పేర్లు పెట్టాలని మేనిఫెస్టోలో పొందుపరచినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా, నిజామాబాద్ పేరును ఇందూర్‌గా, వికారాబాద్‌ను గంగవరంగా, కరీంనగర్‌ను కరీనగర్‌గా, మహబూబ్‌నగర్‌ను పాలమూరుగా, ఆదిలాబాద్‌ను ఏదులాపురంగా, మహబూబాబాద్‌ను మానుకోటగా పేర్లు మారుస్తూ మేనిఫెస్టోలో చేర్చినట్టు సమాచారం.
మరోవైపు.. నేడు బీజేపీ అభ్యర్థులకు సంబంధించి నాలుగో జాబితా విడుదల కానుంది. 23 మంది అభ్యర్థులతో తుది జాబితాలను బీజేపీ విడుదల చేసే అవకాశం ఉంది. బీజేపీ-జనసేన పొత్తులో భాగంగా ఎనిమిది సీట్లను జనసేనకు వదిలేయనున్నారు. ఇక, జనసేనకు వదిలేసిన స్థానాల్లో బీజేపీ కేడర్ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బీజేపీ నేత దిలీపా చారి నాగర్ కర్నూల్ సీటుపై ఒత్తిడి పెంచినట్టు సమాచారం. అటు, శేరిలింగంపల్లి సీటుపై కూడా ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే, పొత్తు కుదిరినప్పటికీ జనసేనతో పనిచేయలేమని బీజేపీ కేడర్ సీరియస్‌గా చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: చిన్న పార్టీలు వద్దు.. జాతీయ పార్టీలతోనే దేశం ఐక్యం: కోమటిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment