‘గెలిస్తే.. వారికి ఇంటికి రూ. 25వేలు ఇస్తాం’ | GHMC Elections 2020 BJP Leader Bandi Sanjay Slams KCR | Sakshi
Sakshi News home page

‘గెలిస్తే.. వారికి ఇంటికి రూ. 25వేలు ఇస్తాం’

Published Thu, Nov 19 2020 1:14 PM | Last Updated on Thu, Nov 19 2020 2:25 PM

GHMC Elections 2020 BJP Leader Bandi Sanjay Slams KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీపై కేసీఆర్‌ వ్యాఖ్యలు దారుణం.. పీఎంని విమర్శించే అర్హత కేసీఆర్‌కు లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ​‘సీఎం కేసీఆర్‌కు బీజేపీ భయం పట్టుకుంది. ఎన్నికల్లో గెలవగానే ఆ ఫ్రంటూ.. ఈ ఫ్రంటూ అన్నారు. చివరకు టెంటు కూడా లేకుండా పోయింది. ఇప్పుడు మళ్లీ దుకాణం మొదలుపెట్టారు. రాష్ట్రంలో హిందువులను ఉండనిస్తారా లేదా. కేసీఆర్‌ ఎంఐఎంకి వత్తాసు పలుకుతున్నారు. రేపటి నుంచి కేసీఆర్‌ చరిత్ర బయటపెడతాం. కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా’ అంటూ సవాలు విసిరారు బండి సంజయ్‌. 

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని మేయర్ చేస్తే.. ప్రతి ఇంటికి 25 వేల రూపాయలు ఇస్తాం. వరద నష్టం అంచనా వేసి... నష్టాన్ని పూరిస్తాం. ప్రజల ఆస్తులకు భరోసా లేదు. ఒక జాతీయ పార్టీ లేఖనే ఫోర్జరీ చేశారంటే... ఇక ప్రజల ఆస్తులకు భరోసా ఏంటి. కేసీఆర్ నిజంగా హిందువైతే.. నకిలీ లేఖపై ప్రమాణం చేయడానికి రేపు 12 గంటలకు ఆయన చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణానికి రావాలి.. లేదంటే క్షమాపణ చెప్పాలి’ అని సంజయ్‌‌ డిమాండ్‌ చేశారు. ‘కేసీఆర్ దేశ ద్రోహి.. ఆయనకి ఇంగితజ్ఞానం లేదు. భాగ్యనగరం దేశభక్తుల అడ్డా. ఆలేరులో దేశద్రోహి వికారుద్దీన్‌ని కేంద్ర బలగాలు ఎన్‌కౌంటర్ చేశాయి. విమర్శలు ప్రజాస్వామ్య బద్దంగా చేయాలి’ అన్నారు. (అది నా సంతకం కాదు : బండి సంజయ్‌)

‘పింకీలు అంతా మంకీలే. తెలంగాణలో కచరాను సాఫ్ చేయాలని అనుకుంటున్నాం. పెడితే పెళ్లి కోరుతారు... లేకుంటే చావు కోరుతారు.  6 ఏళ్లలో టీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలి. టీఆర్ఎస్ గత ఎన్నికల మ్యానిఫెస్టో వెబ్‌సైట్‌లో లేకుండా చేసినా.. మా దగ్గర ఉంది. బీజేపీ 370 ఆర్టికల్ రద్దు చేసింది. రామ మందిర నిర్మాణం చేపట్టింది. సీఏఏ అమలు చేశాం. ముస్లిం మహిళలను కాపాడటానికి ట్రిపుల్ తాలక్‌ని రద్దు చేశాం. హరితహారం, రైతు వేదికకు కేంద్రమే నిధులు ఇచ్చింది’ అన్నారు సంజయ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement