తెలంగాణ ద్రోహులకు కట్టు బానిస | Harish Rao fires on Revanth Reddy | Sakshi
Sakshi News home page

తెలంగాణ ద్రోహులకు కట్టు బానిస

Published Thu, Oct 10 2024 4:44 AM | Last Updated on Thu, Oct 10 2024 4:44 AM

Harish Rao fires on Revanth Reddy

ముఖ్యమంత్రి రేవంత్‌పై హరీశ్‌రావు ధ్వజం

డబ్బు సంచులతో పట్టుబడిన దొంగ..నీతి వచనాలు చెప్తుండు 

తెలంగాణకు అసలు కొరివిదెయ్యం రేవంత్‌.. కొర్రాయి కేసీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ద్రోహులకు సీఎం రేవంత్‌రెడ్డి కట్టు బానిస అని..తాము తెలంగాణ ప్రజలకు బానిసలం అని మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణకు అసలు సిసలు కొరివి దెయ్యం రేవంత్‌ అని, ఆయన నుంచి తెలంగాణను కాపా డే కొర్రాయి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అని వ్యాఖ్యానించారు. బుధవారం ఎల్‌బీ స్టేడియంలో జరిగిన సభలో సీఎం రేవంత్‌ చేసిన వ్యాఖ్య లపై హరీశ్‌రావు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘వేయి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టు ఉంది రేవంత్‌ వైఖరి. 

డబ్బు సంచులతో ఎమ్మెల్యేకు లంచం ఇవ్వబోతూ పట్టుబడిన దొంగ.. ఉపాధ్యాయులకు నీతి వచనాలు చెప్తుండు. సమాజాన్ని తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుల మెదళ్లలో అసభ్యకరమైన భాషను ఎక్కించే ప్రయత్నం చేస్తుండు. ప్రభుత్వ సొమ్మును తెలంగాణ నిర్మాత కేసీఆర్‌ను తిట్టేందుకు ఉప యోగిస్తుండు. రేవంత్‌ లాంటి ఎన్నో కొరివి దెయ్యాలను తుదముట్టించి కేసీఆర్‌ రాష్ట్రాన్ని సాధించారు. 2014లో పొరపాటున నీలాంటి వారికి అధికారం ఇస్తే తెలంగాణను అమ్మేసేవారు. 

కేసీఆర్‌ చేతిలో తెలంగాణ సురక్షితంగా ఉండటం వల్లే నువ్వు సీఎం అయ్యావు. బిల్లారంగాల గురించి విద్యార్థులకు టీచర్లు బోధించమని చెప్తున్నవా. కవిత ఎమ్మెల్సీగా ప్రజాప్రతినిధుల ఓట్లతోనే ఎన్నికైంది. ఓడిన వారికి కాంగ్రెస్‌లోనూ పదవులు ఇచ్చారు కదా’అని రేవంత్‌ను హరీశ్‌రావు ప్రశ్నించారు. ‘కాంగ్రెస్‌ గ్యారంటీలకు హరియాణా ఓటర్ల గొయ్యి తవి్వన రీతిలోనే తెలంగాణలోనూ బొంద తవ్వడం మొదలైంది.’అని హెచ్చరించారు. 

నిరుద్యోగులను మోసం చేసిన దగాకోరు 
ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగులను రెచ్చగొట్టి మోసం చేసిన దగా కోరు రేవంత్‌. కేసీఆర్‌ హయాంలో ఉద్యోగాల నియామక ప్రక్రియను కోర్టుకు వెళ్లి అడ్డుకున్నది కాంగ్రెస్‌ పార్టీ నేతలే. 

రేవంత్‌ మోసాలను అర్థం చేసుకున్న నిరుద్యోగులే కొరివి పెడతారు. 3 నెలల్లో 30వేల ఉద్యోగాల నియామక పత్రాలు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లతోనే సాధ్యమైంది. కేసీఆర్‌ హయాంలో 1.60 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం’అని హరీశ్‌ వెల్లడించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement