సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుకు 2014లో అధికారం ఇచ్చి తప్పు చేశామని ప్రజలు భావిస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. సీఎం జగన్ పాలనకు నేటితో రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం జగన్ పాలన చూశాక 2014లోనే అధికారం ఇస్తే బాగుండేదని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబుకు అధికారం అప్పగిస్తే.. రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా నాశనం చేశారని మంత్రి మండిపడ్డారు.
కరోనాతో అనాథలైన పిల్లలకు రూ.10 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశాం. ఏపీ సీఎం వైఎస్ జగన్ బాటలో కేంద్ర ప్రభుత్వం కూడా నడిచింది. దేశానికే ఆదర్శ పాలన అందించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. సీఎం జగన్ పాలనలో విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు అడ్డమైన హామీలు ఇచ్చారు. వైఎస్ఆర్‌సీపీ మేనిఫెస్టోలో చెప్పిన హామీలను.. కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా సీఎం అమలు చేశారు. రెండేళ్లలో సంక్షేమ కార్యక్రమాలను పెద్దఎత్తున అమలు చేశాం. సంక్షేమ పథకాల ద్వారా రూ.లక్షా 31 వేల కోట్లను పేద ప్రజలకు అందించామని’’ కొడాలి నాని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న రాకుండా అడ్డుపడిన దుర్మార్గుడు చంద్రబాబు అని ఆయన దుయ్యబట్టారు. ఏపీలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక.. జూమ్ నుంచి పప్పునాయుడు, తుప్పునాయుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
‘‘2004, 2009లోనే చంద్రబాబును వైఎస్ఆర్ ఓడించారు. చంద్రబాబును తుక్కు తుక్కుగా వైఎస్ఆర్ ఓడించారు. 2019లో సీఎం వైఎస్ జగన్‌ను భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించారు. అసెంబ్లీ గేటు కూడా తాకనీయకుండా ప్రజలు పప్పునాయుడ్ని ఓడించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వాళ్లు వారసులు అంటున్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబు సీఎం అయ్యారు. కాని ప్రజల మద్దతుతో నేరుగా ఎన్నికైన ముఖ్యమంత్రి సీఎం జగన్. కరోనా కష్టకాలంలో కూడా ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం. పక్క రాష్ట్రం నుంచి జూమ్ ద్వారా తప్పుడు రాజకీయాలు చేస్తున్న. చంద్రబాబు, లోకేష్‌లను రాజకీయ సమాధి చేయాలని కోరుతున్నానని’’ కొడాలి నాని అన్నారు.
‘‘గంటకో మాట, పూటకో మాట చంద్రబాబు మాట్లాడుతారు. ప్రజల సొమ్మును లూటీ చేసినవారు ఎవరినైనా వదిలిపెట్టం. చంద్రబాబు, లోకేష్ బతికి ఉండగా సీఎం జగన్‌ను అధికారం నుంచి దించలేరు. సీఎం జగన్‌కు ప్రజల ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేగా గెలవలేని పప్పునాయుడు మళ్లీ అధికారంలోకి వస్తాడా?. దేశంలో ఉన్న అన్ని పార్టీలను కలుపుకుని వచ్చినా చంద్రబాబు గెలవలేడని’’ మంత్రి కొడాలి నాని అన్నారు.
అట్టడుగు స్థాయిలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అట్టడుగు స్థాయిలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఉన్నత స్థాయికి తెచ్చేందుకు.. అగ్రవర్ణాల్లోని పేదల అభ్యున్నతి కోసం సీఎం జగన్ యత్నిస్తున్నారన్నారు. చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజలు నమ్మరని కొడాలి నాని అన్నారు.
చదవండి: 2 Years Of YS Jagan Rule In AP: ఆచరణలో 'అందరివాడు'
Photosynthesis : (ఛాయాచిత్రం చెప్పిన కథ)
Comments
Please login to add a commentAdd a comment