![Sharad Pawar Says Finishing Off Its Regional Allies Gradually - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/10/pawar.jpg.webp?itok=McNgyom1)
బీహార్ రాజకీయాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. జేడీయూ నితీష్ కుమార్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. నితీష్ కుమార్.. బీజేపీతో దోస్తీకి కటీఫ్ చెప్పడాన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు స్వాగతిస్తున్నారు. తాజాగా నితీష్ కుమార్ నిర్ణయంపై ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ స్పందించారు.
ఈ క్రమంలో బీజేపీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రాంతీయ మిత్రులను బీజేపీ క్రమంగా అంతం చేస్తున్నదని విమర్శించారు. జేడీయూలో బీజేపీ చిచ్చు రాజేసిందన్నారు. కాగా, దేశంలో బీజేపీ వంటి భావజాలంతో నడిచే పార్టీ మాత్రమే భవిష్యత్తులో ఉంటుందని జేపీ నడ్డా చేసిన కామెంట్స్ ఇందుకు నిదర్శమనమన్నారు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను అధికార బీజేపీ నాశనం చేస్తున్నదని.. ఇందుకు అకాలీ దళ్ పార్టీనే ఉదాహరణ అని చెప్పారు. అలాగే మహారాష్ట్రలో శివసేన, బీజేపీ చాలా ఏళ్లుగా కలిసి ఉన్న సంగతిని ఆయన గుర్తు చేశారు. తాను కూడా కాంగ్రెస్‌ను వీడినప్పటికీ ఎన్సీపీ పార్టీతో కొత్త గుర్తుతో ముందుకు వెళ్లానని స్పష్టం చేశారు.
‘BJP wants to eliminate regional allies, first Nitish Kumar became aware’, Sharad Pawar’s major allegation BJP is eliminating regional allies Nitish Kumar, JP Nadda’s comments are active in front of Sharad Pawar https://t.co/gZMn1eQJGj
— The Google (@thegoogle93) August 10, 2022
ఇది కూడా చదవండి: ప్రధాని రేసులో నితీష్ కుమార్.. ప్రశాంత్ కిషోర్ హాట్ కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment