![ఔరంగబాద్‌లో సంక్షేమ పథకాల బుక్‌లెట్ అందిస్తున్న ఎమ్మెల్యే అన్నా - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/1/31gdlr70r-260037_mr.jpg.webp?itok=MpHmuNbC)
ఔరంగబాద్‌లో సంక్షేమ పథకాల బుక్‌లెట్ అందిస్తున్న ఎమ్మెల్యే అన్నా
● ఎమ్మెల్యే అన్నా రాంబాబు
కంభం: వైఎస్సార్ సీపీ పాలనలో గడప వద్దకే సంక్షేమ అందుతున్నాయని ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు అన్నారు. మండలంలోని ఔరంగబాద్, నడింపల్లి గ్రామాల్లో సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే గడపగడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. సచివాలయ పరిధిలోని ప్రతి ఇంటి వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే వారికి అందుతున్న సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. అర్హత ఉండి ఇంకా సంక్షేమ పథకాలు అందని వారుంటే వారి వివరాలు నమోదు చేసుకొని వారికి పథకాలు అందేలా చూడాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలు, కుల మతాలతో సంబంధం లేకుండా అర్హతే కొలమానంగా ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో రైతులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు సంతోషంగా ఉండటంతో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామాలకు వెళ్లిన తమకు ప్రజలు సంతోషంగా స్వాగతం పలుకుతున్నారన్నారు. విద్య, వైద్య రంగంలో ఎన్నో మార్పులు జరిగాయని, పేదలకు కార్పొరేట్ స్థాయి విద్య అందడంతో పాటు మెరుగైన వైద్యసేవలందుతున్నాయన్నారు. ఏ ఒక్క అర్హుడికి నష్టం జరగకూడదన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
గ్రామ సర్పంచ్ వరికుంట్ల కళావతి, ఎంపీడిఓ సయ్యద్ మస్తాన్ వలి, తహసీల్దార్ శైలేంద్రనాధ్, మండల కన్వీనర్ గొంగటి చెన్నారెడ్డి, జేసీఎస్ కన్వీనర్ డిష్ మున్నా, మాజీ ఏఎంసీ చైర్మన్ నెమలిదిన్నె చెన్నారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సయ్యద్ జాకీర్ హుస్సేన్, మాజీ సర్పంచ్ సబ్బసాని సాంబశివారెడ్డి, వరికుంట్ల సుబ్బారావు, ఎంపీటీసీలు ఆనంద్, నాగరాజు, హసీనా, కంభం సర్పంచ్ పల్నాటి బోడయ్య, యల్‌కోట సర్పంచ్ బాష, నాయకులు కొత్తపల్లి శ్రీను, వెంకటేశ్వర్లు, వెంకటరమణ, కటికల భాస్కర్, గోపి, జమ్ములదిన్నె మధుసుధనరావు, పెద్దకోటేశ్వరరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment