![బుక్‌లెట్ అందిస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్ - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/24/23ypl01r-260015_mr_0.jpg.webp?itok=mozDs8ld)
బుక్‌లెట్ అందిస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్
యర్రగొండపాలెం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు జవాబుదారీ పాలన అందిస్తున్నారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. శనివారం గురిజేపల్లిలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పథకాల అమలు గురించి క్యాలెండర్ విడుదల చేసి కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందేవిధంగా చర్యలు తీసుకుంటున్నారన్నారు. ప్రజలు తమకు కావాల్సిన అవసరాలను చెప్పుకుంటుంటే నిలదీస్తున్నారంటూ.. ఎల్లో మీడియా పనికట్టుకొని ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. 2014 నుంచి అధికారంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడంతో పాటు రూ. 371 కోట్ల స్కిల్ నిధులను దిగమింగారని, దీనివలన పరిశ్రమలు ఏర్పాటు కాలేదన్నారు. యువత నిరుద్యోగులుగానే మిగిలి పోయే విధంగా చేశారని విమర్శించారు. ప్రజా సమస్యల గురించి చర్చించాల్సిన శాసనసభలో మీసాలు తిప్పడం, పేపర్లు చింపి గౌరవ స్పీకర్‌పై విసరడం, ఈలలు వేయడం లాంటి చర్యలకు టీడీపీ ఎమ్మెల్యేలు పాల్పడటం శోచనీయమఅన్నారు.
వ్యవసాయానికి అండ జగనన్న
వైఎస్సార్ రైతు భరోసా వ్యవసాయానికి అండగా ఉండేందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి క్రమం తప్పకుండా రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ చేస్తున్నారని మంత్రి అన్నారు. గత టీడీపీ ప్రభుత్వ కాలంలో రైతులు అనేక ఇబ్బందులకు గురయ్యారని, అప్పుల బాధతో అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 2019 ప్రారంభం నుంచే జగనన్న నేతృత్వంలో రాష్ట్రంలోని రైతులు వ్యవసాయాన్ని పండగ చేసుకుంటున్నారని తెలిపారు. ఎంపీపీ దొంతా కిరణ్‌గౌడ్, జెడ్పీటీసీ చేదూరి విజయభాస్కర్, వివిధ విభాగాల నేతలు ఒంగోలు మూర్తిరెడ్డి, కొప్పర్తి చిన్న ఓబులరెడ్డి, బీవీ సుబ్బారెడ్డి, సయ్యద్ షాబీర్ బాష, సయ్యద్ జబీవుల్లా, ఐవీ సుబ్బారావు, సర్పంచ్‌లు ఫిలిప్, సత్తిరెడ్డి, ముసలారెడ్డి, ఎంపీటీసీ ఎన్. నాసరయ్య పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఊచలు లెక్కబెడుతున్న చంద్రబాబు మంత్రి ఆదిమూలపు సురేష్
Comments
Please login to add a commentAdd a comment