సొంతింటి కల నెరవేరింది
మాది చింతలపాలెం గ్రామం. 11 మందితో కలిసి పాత ఇంట్లో జీవించేవాళ్లం. కూలి పని చేస్తేనే కుటుంబ పోషణ జరిగేది. సొంతిల్లు కట్టుకోవాలని ఆశ ఉన్నా.. ఆర్థిక స్తోమత లేదు. ప్రభుత్వం ఇంటి పట్టా ఇచ్చి ఇల్లు మంజూరు చేసింది. ప్రభుత్వం ఇచ్చిన బిల్లుతో పాటు దాచిపెట్టుకున్న కొద్దిపాటి డబ్బుతో ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేశాం. ఇప్పుడు మా ఇల్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉంది. సీఎం జగన్ వల్లే మా సొంతింటి కల సాకారమైంది. నా మనువడు లాంటి జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటాం.
– మేడికొండ పెదలక్ష్మమ్మ, చింతలపాలెం, జరుగుమల్లి మండలం
ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ ఊపిరినిచ్చాయి
మాది పేద కుటుంబం. కిడ్నీలో రాళ్లు ఉండటంతో ఆరోగ్యశ్రీ ద్వారా ఒంగోలు నల్లూరి నర్శింగ్ హోంలో శస్త్ర చికిత్స చేయించుకున్నా. కిడ్నీ పనితీరు సరిగా లేదని, తక్కువగా ఉందని, జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించి ఇంటికి పంపించారు. కొంతకాలానికి బీపీ నియంత్రణ సరిగా లేకపోవడంతో హైదరాబాదులోని గ్లోబల్ వైద్యశాలలో పరీక్షలు చేయించుకున్నా. గుండెలో రెండు వాల్వులు బ్లాక్ అయ్యాయని తెలిపారు. ఒకసారి ఆరోగ్య శ్రీ పరిధిలోకి రావడంతో రెండో సారి వీలు కాలేదు. అప్పు చేసి హైదరాబాద్ గ్లోబల్ వైద్యశాలలో శస్త్ర చికిత్స చేయించుకున్నా. ఆ బిల్లులు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.1,25,000 మంజూరు చేశారు. జగనన్న ఊపిరి పోశారు. ఆయనకు రుణపడి ఉంటాం.
– కోలా శ్రీనివాసరావు. చింతలపాలెం, జరుగుమల్లి మండలం
ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు
టంగుటూరు 3వ సచివాలయంలో జగనన్న సురక్ష క్యాంపులో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు దరఖాస్తు చేసుకున్నా. వలంటీరు మా ఇంటికి వచ్చి అవసరమైన పత్రాలు తీసుకుని వెళ్లాడు. అధికారులు పరిశీలించి వెంటనే ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేశారు. నేను కారు డ్రైవర్‌గా పనిచేస్తుంటా. గతంలో ధ్రువీకరణ పత్రాలు కావాలంటే సెలవు పెట్టుకుని కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరగాల్సి వచ్చేది. జగనన్న సీఎం అయ్యాక సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి అన్ని సేవలు అందిస్తున్నారు. నిజంగా ఇటువంటి సదుపాయం గతంలో మేము చూడలేదు. సీఎం జగనన్నకు ధన్యవాదాలు.
– తన్నీరు బాబు, టంగుటూరు
కల సాకారమైంది
సొంతింటి కల సాకారం అవుతుంటే సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు చాలీచాలని గదిలో ఉన్నాం. జగనన్న ఆడపడుచుల పేరున ఉచితంగా నివేశన స్థలం ఇచ్చి పట్టాతో పాటు ఇంటి నిర్మాణం చేపట్టడం మా లాంటి వాళ్లకు ఎంతో ఆసరాగా నిలిచింది. ముఖ్యమంత్రి జగనన్న ఇంటి స్థలాలు ఇవ్వడం కోసం తీసుకున్న సాహసోపేత నిర్ణయం అద్భుతం. పేదల సొంతింటి కల ఎన్నో ఏళ్లుగా కలగానే ఉంది. నేడు ఆ కల సాకారం అవుతుంటే పేదల ఇంట్లో వెలుగులు నింపినట్టుంది. జగనన్నకు రుణపడి ఉంటాం.
– కె.మంజులాదేవి, తువ్వపాడు, కొనకనమిట్ల మండలం
15 ఏళ్లుగా బాడుగ ఇల్లే.. ఎట్టకేలకు కల నిజమైంది
సొంతిల్లు లేక 15 ఏళ్లుగా బాడుగ ఇంట్లోనే ఉంటున్నాం. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్జీ ఇస్తే అర్హత ఉందని అధికారులు గుర్తించి జమ్ములపాలెం జగనన్న కాలనీలో ఇంటి స్థలం మంజూరు చేశారు. అందులో గృహ నిర్మాణానికి రూ.1.80 లక్షలు ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం అందింది. డ్వాక్రా ద్వారా కొంత రుణం తీసుకుని ఇల్లు నిర్మించుకున్నాం. సొంతింటి కల జగనన్న ద్వారా సాకారమైంది. జీవితాంతం జగనన్నకు రుణపడి ఉంటాం.
– యిస్తర్ల పద్మ, జమ్ములపాలెం, టంగుటూరు మండలం
Comments
Please login to add a commentAdd a comment