మార్కెట్‌లో షాపుల సీజ్
ఒంగోలు సబర్బన్: ఒంగోలు కూరగాయల మార్కెట్లో అదికారుల వేధింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. కరోనా సమయం నుంచి అద్దె బకాయిలపై వడ్డీ మాఫీ చేయమని వ్యాపారులు ప్రాథేయపడుతున్నా వారం రోజులుగా మార్కెట్‌లో ఒంగోలు నగర పాలక సంస్థ అధికారులు దాడుల పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు. అందులో భాగంగా మంగళవారం పోలీసులతో వచ్చిన అధికారులు హోల్‌సేల్ మార్కెట్ కాంప్లెక్స్‌లో అద్దె బకాయిలు ఉన్న షాపులకు సీళ్లు వేసేందుకు మూకుమ్మడిగా సిద్ధమయ్యారు. ఉదయాన్నే మార్కెట్‌లోకి ప్రవేశించిన అధికారులు, పోలీసులు కొంతసేపు హడావుడి సృష్టించారు. వడ్డీ మాఫీ చేస్తే బకాయిలు మొత్తం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామన్నా కనీసం కనికరం లేకుండా దాదాపు మార్కెట్‌లోని పది షాపులకు పైగా సీళ్లు వేశారు. మొదటగా వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల షాపుల వద్దకు వెళ్లిన అధికారులు నానా హంగామా చేశారు. దాదాపు పది షాపులకు పైగా సీళ్లు వేశారు. మొదట పురణి ప్రభావతి షాపు వద్దకు వెళ్లి సీలు వేసేందుకు రంగం సిద్ధం చేశారు. షాపు నిండా కూరగాయలు ఉండటంతో సీజ్ చేస్తే లోపల ఉన్న కూరగాయలు వృథా అవుతాయని, దాదాపు రూ.లక్షల్లో నష్టపోతామని భావించిన షాపు యజమానురాలు అప్పటికప్పుడు బ్యాంకు చెక్కులు ఇచ్చి గండం కట్టెక్కేందుకు నిర్ణయించుకున్నారు. గత్యంతరం లేని పరిస్థితిని ఒంగోలు నగర పాలక సంస్థ అధికారులు వ్యాపారుల్లో కల్పిస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపునకు ఈ విధంగా అవకాశం దొరికిందిలే అనుకున్నారో ఏమో మరి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వ్యాపారులు ఆరోపిస్తున్నారు.
కూరగాయల మార్కెట్‌లో కొనసాగుతున్న వేధింపులు వడ్డీ లేకుండా చేయాలని వేడుకున్నా కనికరం లేకుండా చేస్తున్న అధికారులు మార్కెట్‌లో దాదాపు 10కి పైగా షాపులకు సీళ్లు వేసిన అధికారులు
Comments
Please login to add a commentAdd a comment