క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోవాలి
ఒంగోలు అర్బన్: క్యాన్సర్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, నిరంతరం స్క్రీనింగ్ చేయించుకోవడంతో పాటు క్యాన్సర్ అంటే భయపడకుండా ధైర్యంగా ఉంటే జయించవచ్చని ఎంతోమంది నిరూపించారని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మంగళవారం కలెక్టరేట్ నుంచి ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించి కొంతమేరకు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 7,64,400 గృహాలకు 1,88,854 గృహాలను సిబ్బంది సందర్శించి 5,32,212 మంది ప్రజలకు క్యాన్సర్ పరీక్షలు నిర్వహించినట్లు వివరించారు. 3667 మందిని క్యాన్సర్ అనుమానితులుగా గుర్తించినట్లు తెలిపారు. 18 ఏళ్లు దాటిన సీ్త్ర, పురుషులకు ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తారన్నారు. రొమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్లకు సంబంధించిన పరీక్షలతో పాటు ఎన్‌సీడీ 3.0 భాగంగా సమగ్ర ఆరోగ్య సర్వే నిర్వహించి బీపీ, షుగర్, హిమోగ్లోబిన్ పరీక్షలు ఇంటి వద్దనే చేస్తారన్నారు. అనంతరం చర్చి సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. దీనిలో డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వర్లు, ఎన్‌సీడీ నోడల్ అధికారి భగీరథి, డాక్టర్‌లు పద్మజ, అనిల్, హకీమ్, ఇతర అధికారులు డీ శ్రీనివాసులు, విక్టర్‌బాబు, ఆశా కార్యకర్తలు, నల్లూరి నర్సింగ్ కాలేజి విద్యార్థులు పాల్గొన్నారు.
మానసిక ధైర్యంతో క్యాన్సర్‌ను జయించవచ్చు కలెక్టర్ తమీమ్ అన్సారియా
Comments
Please login to add a commentAdd a comment