9న జెడ్పీ సర్వసభ్య సమావేశం
ఒంగోలు సిటీ: జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 9వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఒంగోలులోని పాత జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ చిరంజీవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన నిర్వహించే సమావేశానికి ప్రజాప్రతినిధులు, అధికారులందరూ తప్పకుండా హాజరుకావాలని కోరారు.
మద్యం దుకాణాలకు గీత కులాలు దరఖాస్తు చేసుకోవాలి
ఒంగోలు సిటీ: జిల్లాలో ప్రభుత్వం కేటాయించిన మద్యం దుకాణాల కోసం గీత కులాలకు చెందిన వ్యాపారులు దరఖాస్తు చేసుకోవాలని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ షేక్ ఖాజామొహిద్దీన్ తెలిపారు. స్థానిక ఎకై ్సజ్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ షేక్ ఖాజామొహిద్దీన్ పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 171 మద్యం దుకాణాలు ఉండగా వాటిలో 10 శాతం ప్రకారం 17 దుకాణాలను గీత కార్మికుల కోసం ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. ఇందులో గత నెల 24న జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ తీశారని, లాటరీలో వచ్చిన ఉపకులాల వారు మాత్రమే ఆయా మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. దరఖాస్తుతో పాటు సాధారణ రుసుములో 50 శాతం చెల్లించాలని చెప్పారు. గడిచిన 8 నెలల కాలాన్ని మినహాయించి లైసెన్స్ ఫీజు నిర్ణయించినట్లు తెలిపారు. ఒక వ్యక్తికి ఒక దుకాణం మాత్రమే కేటాయిస్తారని, ఏ జిల్లాకు చెందిన వారు ఆ జిల్లాలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు
Comments
Please login to add a commentAdd a comment