వెలిగొండ ప్రాజెక్టు దశాబ్దాల కల...ప్రకాశం, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లోని దుర్భిక్ష ప్రాంతాల ప్రజల సుదీర్ఘ స్వప్నం నేడు సాకారం కానుంది. నాడు తండ్రి వైఎస్సార్ ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుడితే నేడు ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పనులు పూర్తి చేసి నేడు మూడు జిల్లాల ప్రజలకు అంకితం చేయనున్నారు. ఆసియాలోనే అతిపెద్ద నీటిపారుదల సొరంగాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి అటు ప్రజకు, ఇటు రైతులకు పుష్కలంగా నీరందించనున్నారు. దీనిని పూర్తి చేయడం ద్వారా ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు సీఎం జగన్.
వైఎస్సార్ ఆశయాలకు ఊపిరి..
వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్
సాక్షిప్రతినిధి, ఒంగోలు: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును అత్యంత వేగంగా పూర్తి చేసి ప్రకాశం జిల్లాతో పాటు కడప, నెల్లూరు జిల్లాల ప్రజల దశాబ్దాల కల సాకారం చేద్దామని మహానేత డాక్టర్ వైఎస్‌ఆర్ వజ్ర సంకల్పంగా వెలిగొండ ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. శ్రీశైలం నుంచి రోజుకు 11,584 క్యూసెక్కుల నీటిని తరలించటం ద్వారా 53.85 టీఎంసీల సామర్ధ్యంతో నల్లమల సాగర్ ప్రాజెక్టును నిర్మించేలా రూపకల్పన చేశారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని వర్షాభావ ప్రాంతాల్లో 4.60 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 మండలాల్లోని 16 లక్షల మంది జనాభాకు తాగునీరు అందించే విధంగా ప్రాజెక్టు డిజైన్‌ను తయారు చేశారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 2004 అక్టోబర్ 27న ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. జలయజ్ఞంలో భాగంగా రూ.5300 కోట్లతో అంచనాలతో పనులు ప్రారంభించారు. రూ.3,581.57 కోట్లు ఖర్చుచేసి ఐదేళ్ల కాలంలో 50 శాతానికి పైగా పనులు పూర్తి చేశారు. ఆయన అకాల మరణం తర్వాత పనులు మరుగున పడిపోయాయి. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు దీనిని ఏటీఎంగా వాడుకుని నిధులు మింగేశారు. 2019లో అధికారం చేపట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తండ్రి ఆశయాలను నెరవేర్చేందుకు నడుం బిిగించారు. రివర్స్ టెండర్ల ద్వారా రూ.61.76 కోట్లు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూరేలా చర్యలు చేపట్టారు. రెండు టన్నెల్ పనులను పూర్తి చేసి ప్రకాశం పశ్చిమ ప్రాంతంతో పాటు వైఎస్‌ఆర్ కడప, నెల్లూరు జిల్లాల ప్రజల్లో ఆనందం నింపారు.
యద్ధప్రాతిపదికన
రెండు సొరంగాలు పూర్తి
మహానేత వైఎస్సార్ ఆశయాల సాధన దిశగా ఆవిర్భంచిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి దుర్భిక్ష ప్రాంతాల ప్రజల ముఖాల్లో ఆనందం చూడాలన్నదే లక్ష్యంగా ముందుకు సాగారు. నత్తనడకన సాగుతున్న రెండు టన్నెళ్ల నిర్మాణ పనులపై దృష్టి సారించారు. 57 నెలల పాలనలో కరోనా రెండు సంవత్సరాలు విజృంభించినా, ఆ మహమ్మారి కారణంగా పనులు చేయలేక పోయినా తరువాత పనులు ముమ్మరం చేశారు. మిగిలిన మొదటి సొరంగం పనులను 2019 నవంబర్‌లో ప్రారంభించారు. మొత్తం సొరంగం 18.800 కిలో మీటర్లు. అప్పటికే తవ్వగా మిగిలిపోయిన 2.883 కిలో మీటర్లు 2021 జనవరి 18 నాటికి పూర్తి చేయించారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొదటి సొరంగం ద్వారా నల్లమల సాగర్‌కు నీటిని తరలించి హెడ్ రెగ్యులేటర్ పనులను కూడా అదే ఏడాది పూర్తి చేయించారు. ఇక రెండో సొరంగం పనులు కూడా పూర్తి చేసి మూడు జిల్లాల ప్రజల్లో వెలిగొండ ప్రాజెక్టుపై ఉన్న ఆశలను చిగురింపజేశారు. ప్రాజెక్టు కోసం రూ.1,046.46 కోట్లు ఖర్చు చేశారు.
వెలిగొండ ప్రాజెక్టు
Comments
Please login to add a commentAdd a comment