డెంగీ, మలేరియాపై అప్రమత్తం చేయాలి
ఒంగోలు టౌన్: సీజనల్‌గా వ్యాపించే డెంగీ, మలేరియాపై అప్రమత్తంగా ఉండాలని నేషనల్ వెక్టార్ బోర్న్ డిసీజెస్ రాష్ట్ర కన్సల్టెంట్ ఈ.కొండారెడ్డి అన్నారు. జిల్లాలో ఆయన పలు ప్రాంతాలను పరిశీలించారు. గద్దలగుంట, దారావారి తోట సచివాలయం పరిధిలోని ఇందిరా కాలనీని సందర్శించి డ్రై డేలో పాల్గొన్నారు. వైద్యశాలలో ల్యాబ్‌ను పరిశీలించి తగిన సూచనలు చేశారు. డెంగీ, మలేరియా కేసుల నివారణకు బాధ్యతతో పనిచేయాలని చెప్పారు. స్థానిక సంస్థలతో కలిసి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లి పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. జిల్లా మలేరియా అధికారి శ్రావణ్ కుమార్, సబ్ యూనిట్ అధికారులు వెంకట రెడ్డి, సాగర్, శ్రీనివాసులు, భాగ్య లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
అక్షరాస్యతతో జీవన ప్రమాణాలు మెరుగు
● డీఆర్‌డీఏ పీడీ వసుంధర
ఒంగోలు అర్బన్: ప్రాథమిక అక్షరాస్యతతో పాటు డిజిటల్, ఆర్ధిక అక్షరాస్యతతో జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని డీఆర్‌డీఏ పీడీ వసుంధర అన్నారు. గ్రీవెన్స్ హాలులో శనివారం వయోజన విద్యా సంచాలకుడు పీ వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఉల్లాస్ అక్షరాస్యతపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో ముఖ్య అతిథిగా డీఆర్‌డీఏ పీడీ పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరికీ కనీస చదువు ఉండాలని, అప్పుడే కుటుంబం తద్వారా సమాజం అన్నీవిధాలుగా అభివృద్ధి సాధిస్తుందన్నారు. కేరళలో నూరు శాతం అక్షరాస్యత ఉన్నట్లు ఉల్లాస్ అక్షరాస్యత కార్యక్రమం ద్వారా జిల్లాలో నూరు శాతం అక్షరాస్యత సాధించాలన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ మాధురి, సచివాలయాల నోడల్ అధికారి ఉషారాణి, రిస్సోర్స్ పర్సన్స్ మనోజ్‌బాబు, సురేఖ, సుబ్బారావు, ఆదిశేషు వయోజన విద్య సిబ్బంది పాల్గొన్నారు.
కార్మికులపై రాజకీయ వేధింపులు ఆపాలి
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగర పాలక సంస్థలోని పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న మేసీ్త్రలపై రాజకీయ వేధింపులు ఆపాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్(సీఐటీయూ) ఒంగోలు నగర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు యూనియన్ ఆధ్వర్యంలో శనివారం నగర పాలక సంస్థ కార్యాలయం ముందు యూనియన్ నాయకులు, మేసీ్త్రలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకుడు కందుల ఆదినారాయణ మాట్లాడుతూ ఒంగోలు నగర పాలక సంస్థలో పారిశుధ్య విభాగంలో మేసీ్త్రలుగా పనిచేస్తున్న వారిని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాజకీయ వేధింపులకు గురిచేసి కావాలని మేసీ్త్రలను విధుల నుంచి తప్పించారన్నారు. కార్మికులపై రాజకీయ వేధింపులు ఆపాలని, మేసీ్త్రలను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేసీ్త్రలకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కూడా కోరారు. అక్టోబర్ నెల మస్టర్‌తో వేతనాలు ఇవ్వాలన్నారు. నగర పాలక సంస్థ పాలక మండలి జోక్యం చేసుకోవాలని, నగర కమిషనర్ చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిలువరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు, మేసీ్త్రలు పాల్గొన్నారు.
పశుగణనను
పరిశీలించిన జేడీ
నాగులుప్పలపాడు: అఖిల భారత 21వ జాతీయ పశుగణన సర్వేలో ప్రతి రైతుకు ఉన్న పశువులను పరిగణలోకి తీసుకోవాలని పశుసంవర్థకశాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ డా.బేబీరాణి సూచించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న పశుగణనలో భాగంగా శనివారం మండలంలోని ఉప్పుగుండూరు, చదలవాడ గ్రామాల్లో జరుగుతున్న పశుగణన సర్వేను జేడీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పశుగణన చేస్తున్న సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేశారు. కార్యక్రమంలో వైద్యులు జాస్మిన్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment