డ్రోన్ టెక్నాలజీపై శిక్షణ
ఒంగోలు టౌన్: డ్రోన్ టెక్నాలజీ వినియోగంపై మహిళా పోలీసులకు ప్రత్యేక శిక్షణకు శ్రీకారం చుట్టారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో మంగళవారం ఎస్పీ ఏఆర్ దామోదర్ స్వయంగా డ్రోన్ ఆపరేట్ చేసి దాని వినియోగాన్ని మహిళా పోలీసులకు వివరించారు. ప్రతి మహిళా పోలీసు డ్రోన్ పైలెట్‌గా శిక్షణ పొందాలని సూచించారు. జిల్లాలోని పోలీసులందరికీ డ్రోన్ టెక్నాలజీపై అవగాహన కల్పిస్తామని, ఇప్పటి వరకు జిల్లాలో 300 మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. జిల్లాలో డ్రోన్ డివైన్ పోలీసింగ్ చేపడతామని, డ్రోన్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేస్తామని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, వివిధ బందోబస్తులు, జాతరలు, ఊరేగింపుల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్ టెక్నాలజీని ఉపయోగిస్తామన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణ, విపత్తులను ఎదుర్కోవడానికి కూడా డ్రోన్లు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని చెప్పారు. హైవేలపై బైక్ రేసులను అరికట్టడానికి ఇకపై డ్రోనులను విరివిగా ఉపయోగించనున్నట్లు చెప్పారు. ఈవ్‌టీజింగ్, నాటుసారా తయారీ, అసాంఘిక కార్యకలాపాలపై డ్రోన్ల ద్వారా నిఘా పెడతామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. నాగేశ్వరరావు, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ కేవీ రాఘవేంద్ర , ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ వి. సూర్యనారాయణ, పీసీఆర్ ఇస్‌ఐ ప్రభాకర్ రెడ్డి, తాలుకా పీఎస్ ఎస్సైలు కృష్ణ పావని, అనిత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment