పత్తి ధరలు రైతులను తీవ్ర నిరాశా నిస్పృహల్లోకి నెడుతున్నాయి. గడిచిన మూడేళ్లుగా ఆశించిన స్థాయిలో ధర పలికిన పత్తికి ఈ ఏడాది పెట్టుబడి సొమ్ము కూడా చేతికందే పరిస్థితి లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. గులాబీ పురుగు ఉధృతి, గత నెలలో వారం రోజులపాటు కురిసిన వర్షాలకు పత్తి చేలు ఉరకెత్తడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపాయి. దీనికి తోడు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటి పండు పడిన చందంగా మారింది. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధర దక్కనీయకుండా చేస్తుండటంతో ఏమి చేయాలో దిక్కు తెలియక రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపే పరిస్థితులు దాపురించాయి.
Comments
Please login to add a commentAdd a comment