మేస్తిరి..!
పోస్టులు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చిరుద్యోగులపై విరుచుకుపడుతోంది. ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగించింది. మరి కొందరితో బలవంతంగా రాజీనామాలు చేయించింది. తాజాగా ఒంగోలు నగరపాలక సంస్థ పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న మేసీ్త్రలపై కన్నుపడింది. కూటమి నేతల ఒత్తిడితో కార్పొరేషన్ అధికారులు 108 మందిని నోటిమాటతో తొలగించారు. కొత్తవారిని నియమించే విషయంలో భారీ ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒంగోలుకు చెందిన ముఖ్య నేతతో పాటు అటు బీజేపీ, ఇటు జనసేన పార్టీలకు చెందిన నాయకులు ఇప్పటికే మేసీ్త్రల పోస్టులకు
బహిరంగ మార్కెట్‌లో బేరంపెట్టారన్న
ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో ఎక్కడా లేనివిధంగా ఒక్క ఒంగోలు నగర పాలక సంస్థలోనే మేసీ్త్ర వ్యవస్థ నిలిపేశారు. అధికార పార్టీ నేతల మితిమీరిన జోక్యం, వారికి అనుకూలంగా కమిషన్ వ్యవహరిస్తుండడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త కమిషనర్‌గా కే.వెంకటేశ్వరరావు బాధ్యలు చేపట్టారు. ఆయన వచ్చిన తర్వాత మొదటి వేటు పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న మేసీ్త్రలపై వేశారు. నోటి మాటతో వారిని తొలగించారు.
అధికార పార్టీ నేతలకు జీ హుజూర్....
అధికార కూటమి నాయకులు ఏది చెబితే అది కమిషనర్ ఆఘమేఘాలపై చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 15, 20 సంవత్సరాల నుంచి పారిశుధ్య విభాగంలో మేసీ్త్రలుగా పనిచేస్తున్న వారిని ఉన్నట్టుండి ఎందుకు ఆపాల్సి వచ్చిందో వారికే తెలియాలి. ఇప్పుడు పనిచేస్తున్న మేసీ్త్రలు గత టీడీపీ ప్రభుత్వంలో కూడా పనిచేసిన వారే. అయినా వారిని తొలగించడంపై విమర్శలు గుప్పుమంటున్నాయి. పారిశుధ్య విభాగంలో మొత్తం 108 మంది మేసీ్త్రలు పనిచేస్తున్నారు. వీళ్లందరినీ తీసేసి టీడీపీ కూటమి పార్టీల నాయకులకు ధారాదత్తం చేయటానికేనన్న వాదనలూ వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకులు చెప్పారు కాబట్టి ‘‘జీ హుజూర్’’ అంటూ కమిషనర్ అమలు చేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
బహిరంగ మార్కెట్లో పోస్టులు:
పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న మేసీ్త్రలను నోటి మాటతో నిలిపేసిన సంగతి తెలిసిందే. దీంతో అధికార పార్టీకి చెందిన టీడీపీ కూటమి నాయకులు ఆయా పోస్టులను బహిరంగ మార్కెట్లో అమ్మకానికి పెట్టారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పనుల పరిశీలన పేరుతో కూటమి పార్టీలకు చెందిన కొందరిని కొన్ని ప్రాంతాల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు కూడా. అధికార పార్టీలకు చెందిన కార్యకర్తలైనా సరే కొందరు కార్పొరేటర్లు, ముఖ్య నాయకురాలు ఎవరికి వాళ్లు ఒక్కో పోస్టును రూ.2 నుంచి రూ.5 లక్షల వరకు అమ్ముకోవటానికి రంగం సిద్ధం చేసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏరియాల వారీగా సైతం పంచుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం.
ఉద్యోగ భద్రత కల్పించిన అప్పటి సీఎం
వైఎస్ జగన్:
2019 అధికారం చేపట్టిన అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాంట్రాక్టు వ్యవస్థలో ఉన్న సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించారు. అప్పటి వరకు కాంట్రాక్టు వ్యవస్థలో పనిచేస్తున్న వారిని కాంట్రాక్టర్లు ఎప్పుడు పడితే అప్పుడు ఉద్యోగాలు పీకేయటంతో పాటు రాజకీయ కక్షలకు కాంట్రాక్టు వ్యవస్థలో ఉన్న ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భావించి రాష్ట్రంలో ఆప్‌కాస్ అనే ప్రభుత్వ సంస్థను ఏర్పాటు చేశారు. తద్వారా జీతాలు పెంచి, అలవెన్స్‌లు పెంచి ఉద్యోగ భద్రత కల్పించారు. అప్పటి నుంచి వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఆత్మ స్థైర్యం నెలకొంది. మళ్లీ టీడీపీ కూటమి అధికారంలోకి పరిస్థితి తారుమారైంది.
ఒంగోలు నగరపాలక సంస్థ పారిశుద్ధ్య విభాగంలో మేసీ్త్రల తొలగింపు ఏళ్ల తరబడిపనిచేస్తున్న 108 మంది నోటిమాటతో ఊస్టింగ్ కూటమి నేతల ఒత్తిడితోనే బరితెగింపు కమిషనర్ తీరుపై వెల్లువెత్తుతున్న నిరసనలు అమ్మకానికి పోస్టులు ఏరియాల వారీగా పంచుకుంటున్న కూటమి నేతలు
ఆపద సమయాల్లో ప్రాణాలకు తెగించి పనిచేసినా
ఒంగోలు నగరంలోని పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న మేసీ్త్రలు, పారిశుధ్య కార్మికులు ఆపద సమయాల్లో ప్రాణాలకు తెగించి పనిచేశారు. కోవిడ్ వరుసగా రెండు, మూడు సంవత్సరాల పాటు పారిశుధ్య విభాగంలో మేసీ్త్రలు, కార్మికులు ప్రాణాలకు తెగించి పనిచేశారు. కరోనా సోకిన వారి ఇళ్లకు వెళ్లి మరీ సేవలందించారు. విజయవాడ వరదల్లో కూడా ఒంగోలు నగరానికి చెందిన దాదాపు 300 మందికి పైగా కార్మికులు, మేసీ్త్రలను విజయవాడ పంపించి మరీ పనిచేయించుకున్నారు. అయినా కనికరం లేకుండా నిలువునా ఆపేస్తే మా కుటుంబాలు ఏం కావాలని వారు బోరున విలపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment