వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించాలి
కొత్తపట్నం: వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని డీఈవో ఏ కిరణ్‌కుమార్ ఆదేశించారు. కొత్తపట్నం మండలంలోని కొత్తపట్నం, అల్లూరు హైస్కూళ్లను శుక్రవారం ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. హైస్కూళ్లలో మధ్యాహ్న భోజనం, ఆట స్థలం, ఉపాధ్యాయుల పనితీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తపట్నం హైస్కూల్లో 1,376 మంది విద్యార్థులు ఉండటం, బాగా నడపడంపై హెచ్‌ఎం, ఉపాధ్యాయులను అభినందించారు. హెచ్‌ఎం పనితీరుపైనే ఉపాధ్యాయుల పనితీరు ఆధారపడి ఉంటుందన్నారు. కొత్తపట్నం హైస్కూల్లో ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలని హెచ్‌ఎంకు సూచించారు. టీచింగ్‌పై అవగాహన కల్పించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా అపార్ 80 శాతం పూర్తయిందన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం 149 ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థుల పేర్లు, అడ్రసులు, ఇతర వివరాలు మార్చుకోవచ్చని తెలిపారు. తల్లిదండ్రులు, విద్యార్థులు గమనించి సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎఫ్‌ఏ–2 పరీక్షకు సంబంధించి ప్రతి పాఠశాలలో దాదాపు 85 శాతం మార్కులు అప్లోడ్ చేశారని ఉపాధ్యాయులను అభినందించారు. ఈ ఏడాది జరిగే పదో తరగతి పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని కొత్తపట్నం హైస్కూల్ హెచ్‌ఎం ఎం.శ్రీదేవికి సూచించారు. ఎఫ్‌ఏ–2లో కొత్తపట్నం మండలం 85 శాతం, ఒంగోలు మండలం 84 శాతం అప్లోడింగ్ పూర్తి చేసినట్లు చెప్పారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకం, కిచన్ షెడ్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల గైర్హాజరు శాతం తగ్గించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. డ్రాపవుట్ తగ్గించేందుకు ఉపాధ్యాయులకు కొంత మంది విద్యార్థులను కేటాయించాలన్నారు. అల్లూరు, కొత్తపట్నం పాఠశాలల్లో వాచ్‌మేన్, ఆయాల పనితీరు బాగుందన్నారు. క్రీడా ప్రాంగణంలో వాలీబాల్, కబడ్డీ కోర్టులను తక్షణమే ఏర్పాటు చేయాలని పీడీలను ఆదేశించారు. విద్యార్థులను నేషనల్ గేమ్స్‌కు పంపించే విధంగా పూర్తి స్థాయిలో తర్ఫీదు ఇవ్వాల్సిన బాధ్యత వ్యాయామ ఉపాధ్యాయులపై ఉందన్నారు. కొత్తపట్నం హైస్కూల్ ప్లస్‌లో సర్దుబాటు ప్రక్రియలో వచ్చిన కామర్స్, ఎకనామిక్స్ కెమిస్ట్రీ సబ్టెక్టుల టీచర్లను వెంటనే ఆయా మండలాల నుంచి రిలీవ్ చేయాలని ఆదేశించారు. లేని పక్షంలో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైస్కూల్ ప్లస్ టీచర్లపై ఎంఈవోలు మానిటరింగ్ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈవోలు 1, 2 తులసీకుమారి, పద్మావతి, కొత్తపట్నం, అల్లూరు ఇన్‌చార్జి హెచ్‌ఎంలు ఎం.శ్రీదేవి, మైధిలి, స్టాఫ్ సెక్రటరీ, హరిబాబు, స్కూల్ ఫస్ట్ అసిస్టెంట్ సాయికిషోర్ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులతో డీఈవో కిరణ్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment