నెలాఖరులోగా సొసైటీల డిజిటలైజేషన్
● కలెక్టర్ తమీమ్ అన్సారియా
టంగుటూరు: జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల డిజిటలైజేషన్ ప్రక్రియను నెలాఖరులోగా పూర్తి చేయాలని పీడీసీసీ బ్యాంకు అధికారులను కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. శుక్రవారం టంగుటూరు మండలం కొణిజేడు పీఏసీఎస్‌లో చేపట్టిన డిజిటలైజేషన్ ప్రక్రియను జేసీ గోపాల కృష్ణతో కలిసి పరిశీలించారు. కంప్యూటరీకరణ ప్రాజెక్టుకు సంబంధించిన ఎఫ్‌హెచ్‌ఆర్, ఎఫ్‌వీఆర్, సైట్ ప్రిపరేషన్, హార్డ్‌వేర్ పరికరాలు, ఇన్‌స్టాలేషన్, డీసీటీ డేటా, సభ్యత్వం, డిపాజిట్లు, భూమి, పెట్టుబడులు, రుణాలు, డీసీటీ సైన్ ఆఫ్, టి 8 సర్టిఫికెట్, ప్రీ మైగ్రేషన్ ప్రాసెస్, సొసైటీ ట్రైల్ బ్యాలెన్స్, టి 12 సర్టిఫికెట్ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పీఏసీఎస్‌ల కంప్యూటరీకరణను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. డిసెంబర్ నుంచి లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌లో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఈఓ బిందు ప్రత్యూష, పీడీసీసీ బ్యాంకు ఏజీఎం సుబానీ, బ్రాంచ్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.
నేడు ఆట్యాపాట్యా జిల్లా సీనియర్ జట్ల ఎంపిక
ఒంగోలు: ఆట్యాపాట్యా జిల్లా పురుష, మహిళల జట్ల ఎంపిక శనివారం స్థానిక ఏబీఎం జూనియర్ కాలేజీ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు ఆట్యాపాట్యా జిల్లా అధ్యక్షుడు నంబూరు శ్రీనివాసరావు తెలిపారు. సాయంత్రం 3 గంటలకు ఎంపిక పోటీలు నిర్వహిస్తామని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికై న జట్లు ఈనెల 30వ తేదీ నుంచి భీమవరంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రకాశం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment