జే.పంగులూరు: జాతీయ స్థాయి ఖోఖోలో పాల్గొనే రాష్ట్ర జట్టుకు శిక్షణ శిబిరం ముగిసినట్లు రాష్ట్ర ఖోఖో కార్యదర్శి మేకల సీతారామిరెడ్డి తెలిపారు. శుక్రవారం పంగులూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 25 నుంచి 29 వరకు ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘర్ పట్టణంలో 43వ జూనియర్ బాలబాలికల జాతీయ స్థాయి ఖోఖో పోటీలు జరగనున్నాయన్నారు. గత 20 రోజుల నుంచి స్థానిక మంగుల సుబ్బరామిరెడ్డి, బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాలలో ఎస్‌ఆర్‌ఆర్ ఖోఖో అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్ర జట్టుకు శిక్షణ జరుగుతున్నట్లు తెలిపారు. జట్టుకు కోచ్‌గా ప్రకాశం జిల్లా డీఎస్‌ఏ కోచ్‌గా డీఎల్ రెడ్డి వ్యవహరించారని తెలిపారు. రాష్ట్ర శిక్షణ జట్టుకు భోజన వసతులు కల్పించిన గ్రామ పెద్దలు, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్‌రావుకి సీతారామిరెడ్డి, క్రీడాకారులు కృతజ్ఞతలు తెలిపారు. క్రీడాకారులకు దుస్తులు అందించిన నెల్లూరి పీడీ రాజా, బాలికలకు ఎస్‌ఆర్ స్పోర్ట్స్ తరుపున సీతారామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. క్రీడాకారులకు గ్రామ పెద్దలు రాయిణి వెంకటసుబ్బారావు, జాగర్లమూడి సుబ్బారావు, బాచిన చౌదరిబాబు, పీడీ మేకల సీతారామిరెడ్డి క్రీడాకారులకు క్రీడాదుస్తులు అందించారు. ఆటలలో రాణించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ చైర్మన్ బాచిన చెంచు గరటయ్య, రాష్ట్ర ఖోఖో చీఫ్ ప్యాట్రన్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి (ఎమ్మెల్యే), రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు ప్రసాద్, రీఫరీస్ బోర్డు కన్వీనర్ ప్రసాద్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రాజరాజేశ్వరి వారిని ఆశీర్వదించారు.
Comments
Please login to add a commentAdd a comment