బాలకార్మిక వ్యవస్థను అరికట్టాలి
ఒంగోలు అర్బన్: బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా అరికట్టి బాల్య వివాహరహిత, బాల కార్మిక రహిత ప్రకాశం జిల్లా ఆవిష్కరణ కోసం అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా సూచించారు. శుక్రవారం ప్రకాశం భవనంలో జిల్లా స్థాయి బాండెడ్ లేబర్ విజిలెన్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెట్టిచాకిరి (బాండెడ్ లేబర్) నుంచి బాధితులకు విముక్తి కలిగించి పునరావాసం ఏర్పాటు చేయడంతో పాటు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. శ్రమదోపిడీ, లైంగిక దోపిడీ, ఆర్థిక దోపిడీలు ఈ వెట్టిచాకిరీలో ఉంటాయన్నారు. వెట్టిచాకిరిలో పెద్దలు మాత్రమే కాకుండా పిల్లలు ఉంటారని, అటువంటి వారిని గుర్తించి బాధ్యులపై పోలీసు కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెట్టిచాకిరి నిర్మూలన చట్టం 1976ను పక్కాగా అమలు చేయాలన్నారు. వెట్టిచాకిరి నుంచి విముక్తి కలిగిన వారికి ప్రభుత్వ పథకాలు అమలు చేయాలన్నారు. అందుకు అవసరమైన ఆధార్, ఓటరు, ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు, తదితర సర్టిఫికెట్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ గాయత్రీదేవి, డీఎస్పీ శ్రీనివాసరావు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్, గిరిజన సంక్షేమ అధికారి జగన్నాథరావు, డీఈఓ కిరణ్‌కుమార్, డీఎస్‌ఓ పద్మశ్రీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ అర్చన, డీఆర్‌డీఏ పీడీ వసుంధర, డీసీపీఓ దినేష్‌కుమార్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సునీల్‌కుమార్, ప్రియాంక, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
వెట్టిచాకిరి నుంచి బాధితులను విడిపించాలి కలెక్టర్ తమీమ్ అన్సారియా
Comments
Please login to add a commentAdd a comment