పోలేరమ్మ గుడిని తొలగిస్తే ఒప్పుకోం..
కనిగిరి రూరల్: ఎన్‌హెచ్ 565 హైవే పనులను కనిగిరి వాసులు శుక్రవారం అడ్డగించారు. రోడ్డు నిర్మాణంలో భాగంగా పురాతనమైన పోలేరమ్మ గుడిని తొలగించాలని అధికారులు ఏకపక్షంగా నిర్ణయించడం వివాదాస్పదంగా మారింది. వివరాలు.. నకరికల్ టు ఏర్పేడు ఎన్‌హెచ్ 565 హైవే రోడ్డు కనిగిరి మీదుగా వెళ్తుంది. ఈ క్రమంలో కనిగిరిలో పట్టణంలోని పెద చెరువు సమీపంలో ఉన్న పొలాల్లో గుండా కొత్తూరు మీదుగా జాతీయ రహదారి కలుపుతున్నారు. అందులో భాగంగా పట్టణంలోని 9వ వార్డుకు వెనుక (వాల్మీకి వీధి) పంట పొలాల్లో నుంచి రోడ్డు నిర్మిస్తున్నారు. అయితే వాల్మీకి కులస్తులు, స్థానికుల గ్రామ దేవత అయిన పొలేరమ్మ గుడిని రోడ్డు నిర్మాణ కోసం తొలగించేందుకు కాంట్రాక్టర్లు ఉపక్రమించారు. విషయం తెలుసుకున్న స్థానికులు రోడ్డు పనులను అడ్డుకుని ధర్నా చేశారు. వందల ఏళ్లుగా ఉన్న పోలేరమ్మ ఆలయాన్ని రోడ్డు కోసం తొలగిస్తే సహించేది లేదంటూ స్థానికులు తిరుపతయ్య, వెంకట్రావ్, శ్రీను, ఓబయ్య, సాయి, పండు తదితరులు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. గుడి ఉన్న ప్రాంతంలో రోడ్డును మలుపు తిప్పాలని డిమాండ్ చేశారు. పెద్ద సంఖ్యలో స్థానికులు, మహిళలు ధర్నాకు దిగడంతో పోలీసులు రంగంలోకి దిగి నచ్చజెప్పారు. రోడ్డు పనులను తాత్కిలికంగా నిలిపివేశారు. గుడి తొలగింపుపై ఎన్‌హెచ్‌ఏఐ, రెవెన్యూ అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వనట్టు తెలుస్తోంది.
బైపాస్ రోడ్డు పనులను అడ్డుకుని ధర్నాకు దిగిన కనిగిరి వాసులు
కనిగిరిలో తాత్కాలికంగా ఆగిన ఎన్‌హెచ్ 565 రోడ్డు నిర్మాణం
Comments
Please login to add a commentAdd a comment