కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై పోరాడాలి
ఒంగోలు వన్‌టౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై పోరాడాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు అన్నారు. దళిత హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం ఒంగోలు హెచ్‌సీఎం కళాశాల ఎదురుగా ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద మనుస్మృతి ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా నాగేంద్రరావు మాట్లాడుతూ 1927వ సంవత్సరం డిసెంబర్ 25వ తేదీ మహారాష్ట్రలోని మహద్ పట్టణంలో అంటరానితనం, కుల వివక్ష, పౌరహక్కుల నిరాకరణకు నిరసనగా వేలాది మంది ప్రజల సమక్షంలో అంబేడ్కర్ మనుస్మృతి ప్రతులను దహనం చేశారన్నారు. 2024లో కూడా సమాజంలో అంతరాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేశారన్నారు. 74 సంవత్సరాల రాజ్యాంగ సమీక్షలో అమిత్ షా ఉద్దేశపూర్వకంగా అవమానించారన్నారు. కార్యక్రమంలో వై సుబ్రహ్మణ్యం, కే రవి, డీ వెంకట రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment