ఒంగోలు టౌన్: భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) శత వార్షికోత్సవ సభ బుధవారం అద్దంకి బస్టాండు సెంటర్లో నిర్వహిస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 9 గంటలకు మల్లయ్యలింగం భవనం వద్ద సీనియర్ నాయకులు నల్లూరి వెంకటేశ్వర్లు పార్టీ జెండాను ఆవిష్కరిస్తారని తెలిపారు. మధ్యాహ్నం 4 గంటలకు జిల్లా సీపీఐ కార్యాలయం నుంచి చర్చి సెంటర్, ట్రంక్ రోడ్డు, అద్దంకి బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్, కొత్త కూరగాయల మార్కెట్, కొచ్చిన్ కేఫ్, కోర్టు సెంటర్, సీవీఎన్ రీడింగ్ రూమ్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తారని వివరించారు. అనంతరం సీవీఎన్ రీడింగ్ రూం ఆవరణలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య, పీజే చంద్రశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు తెలిపారు. పార్టీ అభిమానులు, కార్యకర్తలు, కార్మిక సంఘం, రైతు సంఘం, విద్యార్థి సంఘం నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment