రాపిడ్ చెస్ చాంపియన్ షిప్‌లో కుమార స్వామికి మూడో స్థ
ఒంగోలు వన్‌టౌన్: రాష్ట్ర స్థాయి రాపిడ్ చెస్ చాంపియన్ షిప్ పోటీల్లో జిల్లాకు చెందిన పోలూరి కుమార స్వామి మూడో స్థానం కై వసం చేసుకున్నారు. జంగారెడ్డి గూడెంలో ఈనెల 24, 25వ తేదీల్లో రాష్ట్ర స్థాయి రాపిడ్ చెస్ చాంపియన్ షిప్ 2024 పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పాల్గొన్న కుమార స్వామి మూడో స్థానంలో నిలిచారు. ఫిబ్రవరి 20 నుంచి 23వ తేదీ వరకూ ఝార్ఖండ్‌లో జరిగే రాపిడ్ నేషనల్ సీనియర్ చెస్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొంటారు.
కొత్త ఆలోచనలతో ముందుకు సాగుదాం
● డీఎంహెచ్‌వో డా.వెంకటేశ్వర్లు
ఒంగోలు టౌన్: నూతన సంవత్సరంలో కొత్త ఆలోచనలతో ముందుకు సాగుదామని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డా. వెంకటేశ్వర్లు అన్నారు. ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ప్రచురించిన నూతన సంవత్సరం డైరీ, కేలండర్‌ను బుధవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు సక్రమంగా వైద్య సేవలు అందించేలా పనిచేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. సమష్టిగా పనిచేయడం వలన లక్ష్యాలు సాధించడం సులువవుతుందని చెప్పారు. డీఎంహెచ్‌ఓగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు రాష్ట్ర ఎన్‌హెచ్‌ఎం జేఏసీ జనరల్ సెక్రటరీ ప్రభాకర్ రెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ ఎస్.ఏడుకొండలు, ప్రసన్న, విజయలక్ష్మి, సుబ్బలక్ష్మి, శ్రీధర్ తదితరులు అభినందించారు.
మెరుగైన వైద్య సేవలు అందిస్తాం
● బాధ్యతలు చేపట్టిన డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వర్లు
ఒంగోలు టౌన్: జిల్లాలోని మారుమూల ప్రజలకు సైతం మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తానని డీఎంహెచ్‌ఓ డాక్టర్ టి.వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం ఆయన డీఎంహెచ్‌ఓగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించి నిర్దేశిత లక్ష్యాలు సాధించేలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ వైద్యశాలలకు చెందిన వైద్యులు, నర్సింగ్ స్టాఫ్ తదితరులతో కలిసి సమన్వయంగా పనిచేస్తామని చెప్పారు. వెంకటేశ్వర్లు ప్రస్తుతం బాపట్ల వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిగా విధులు నిర్వహిస్తూ పదోన్నతిపై ఇక్కడకు వచ్చారు. ఆయనకు జిల్లా వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.
జిల్లాలో సరాసరి 6.9 మి.మీ వర్షపాతం
● అత్యధికంగా కొండపిలో 17.2 మి.మీ
ఒంగోలు అర్బన్: జిల్లాలో బుధవారం సరాసరి 6.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కొండపి మండలంలో 17.2 మి.మీటర్లు నమోదు కాగా పుల్లలచెరువు 16, కొత్తపట్నం 15.6, జరుగుమల్లి 12.6, సంతనూతలపాడు 11.8, తాళ్లూరు 11.6, ముండ్లమూరు 11.2, యర్రగొండపాలెం, ఒంగోలు 10.6, చీమకుర్తి 10.2, మర్రిపూడి 9.8, సింగరాయకొండ 9.4, నాగులుప్పలపాడు 9.2, మద్దిపాడు 8, కొనకనమిట్ల 7, దోర్నాల, టంగుటూరు 6.8, పొన్నలూరు 6.4, పొదిలి 6.2, త్రిపురాంతకం, కురిచేడు, తర్లుపాడు 5.4, దర్శి 5.2, పెదచెర్లోపల్లి 4.6, మార్కాపురం 3.8, అర్థవీడు, సీఎస్‌పురం, పామూరు 3.6, దొనకొండ, కనిగిరి 3, గిద్దలూరు, వెలిగండ్ల 2.8, పెద్దారవీడు, కొమరోలు 2.6, కంభం 2.4, రాచర్ల 2.2, హెచ్‌ఎంపాడు, బేస్తవారిపేట మండలాల్లో 2 మిల్లీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
నేడు ఇంటర్ డిస్ట్రిక్ట్ క్యాడెట్ టీం ఎంపిక
ఒంగోలు టౌన్: పదో ఏపీ డిస్ట్రిక్ట్ క్యాడెట్ అండర్ 17 ఫెన్సింగ్ చాంపియన్‌షిప్ 2024–25 పోటీలకు గురువారం సాయంత్రం ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ సెక్రటరీ జీ.నవీన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1.1.2008 నుంచి 21.12.2011 మధ్యలో పుట్టిన సీ్త్ర, పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులన్నారు. నగరంలోని ఆనంద్ మినీ స్టేడియంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా కేడెట్ టీమ్ సెలక్షన్లకు హాజరయ్యేవారు అసోసియేషన్ ఐడీ కార్డు జిరాక్స్ తో పాటుగా ఆధార్, బర్త్ సర్టిఫికెట్లు తీసుకొని రావాలని కోరారు. పూర్తి వివరాలకు 8978905694, 7671991147 ఫోన్ ద్వారా సంప్రదించాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment