న్యూ ఇయర్ క్యాలెండర్ ఆవిష్కరణ
ఒంగోలు సిటీ: ఒంగోలులోని పీవీఆర్ హైస్కూల్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏపీ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ నాన్ టీచింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నూతన క్యాలెండర్‌ను గుంటూరు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఆర్జేడీ వి.వి.సుబ్బారావు ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకి ఐడెంటిటీ కార్డులు పంపిణీ చేశారు. అసోసియేషన్ సభ్యులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ తారక్‌నాథ్, యూనియన్ అధ్యక్షుడు సీహెచ్.శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ సురేష్‌బాబు, జనరల్ సెక్రటరీ అబ్దుల్ హయత్, కోశాధికారి సాయి కిషోర్, పబ్లిసిటీ సెక్రటరీ పి.అనీల్ పురుషోత్తమ్, మహిళా రిప్రజెంటేటివ్ ఐ.వి.సుజాత, అసోసియేట్ ప్రెసిడెంట్ మధుసూదనరావు, జాయింట్ సెక్రటరీలు ఎన్.వాణి, కె.రామకృష్ణారెడ్డి, రాజు సురేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ వై.రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment