‘మద్యం తాగొచ్చి తిడుతున్నాడు’
బేస్తవారిపేట: వెలిగొండ ప్రాజెక్ట్ ఈఈ టి.వెంకట రమణయ్య నిత్యం మద్యం సేవించి తిడుతున్నాడని కార్యాలయ సిబ్బంది ధర్నాకు దిగారు. ఈ సంఘటన బుధవారం చింతలపాలెం సమీపంలోని వెలిగొండ ప్రాజెక్ట్ కార్యాలయంలో జరిగింది. ఈఈ వెంకట రమణ మద్యం తాగి విధులకు హాజవుతున్నాడని, కార్యాలయ సిబ్బందిని నోటికొచ్చినట్లు తిడుతున్నాడని వాపోయారు. కొంత మంది సిబ్బంది కార్యాలయానికి రాకున్నా డబ్బులు తీసుకొని హాజరు వేసి జీతం చెల్లిస్తున్నారని, అద్దె వాహనాలకు అగ్రిమెంట్ చేయకుండా లంచం అడుగుతున్నాడని, బిల్లు చేసేటప్పుడు సగం ఇస్తేనే బిల్లులపై సంతకం పెడతానని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని మండిపడ్డారు. మూడు నెలులగా కార్యాలయ గెస్ట్‌హౌస్ మూత వేస్తున్నట్లు మెమో ఇచ్చారని, కానీ ఆయన మాత్రం తాగేందుకు, రెస్ట్ తీసుకునేందుకు ఉపయోగించుకుంటున్నాడని తెలిపారు. కార్యాలయంలో టీ, వాటర్ బాటిళ్లు అన్నీ సిబ్బంది పెట్టుకోవాల్సి వస్తుందని, కార్యాలయానికి అవసరమైన స్టేషనరీ ఒక్కడి తేవడం లేదన్నారు. విధుల్లో చేరి ఏడు నెలలవుతున్నా డీఈలు, ఏఈలతో ఒక్క మీటింగ్ పెట్టలేదని, ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నా ఫీల్డ్ విజిట్ చేయలేదన్నారు. మేం ప్రాజెక్టు వద్దకు వెళ్తే ఎక్కడికి వెళ్లారని అసహ్యంగా తిడుతున్నాడని, అవహేళనగా మాట్లాడుతూ హీనంగా చూడటంపై ప్రాజెక్ట్ డీఈలు, ఏఈలు, కార్యాలయ సిబ్బంది గెస్ట్‌హౌస్ వద్ద ఈఈని నిలదీశారు. సిబ్బంది మూకుమ్మడిగా ప్రశ్నించడంతో సమాధానం చెప్పకుండా బయటకు వెళ్లిపోయారు. కార్యక్రమంలో డీఈలు, ఏఈలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఈఈ మాకొద్దు బాబోయ్.. ధర్నాకు దిగిన వెలిగొండ ప్రాజెక్టు కార్యాలయ సిబ్బంది
Comments
Please login to add a commentAdd a comment