నవ వసంతరాగం.. | - | Sakshi
Sakshi News home page

నవ వసంతరాగం..

Published Thu, Jan 2 2025 12:59 AM | Last Updated on Thu, Jan 2 2025 12:59 AM

నవ వస

నవ వసంతరాగం..

పర్యవేక్షణ మాత్రమే చూస్తున్నారు

జిల్లాలో నాలుగు నియోజకవర్గాలలో క్రీడా వికాస కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం నిర్వహణ కోసం ఎవరు లేకపోవడంతో కొంత మందికి పర్యవేక్షించాలని చెప్పాం. అంతే కానీ నగదు లావాదేవీలు అన్నీ ప్రభుత్వ ఆధీనంలో జరుగుతున్నాయి. కలెక్టర్‌ ఆదేశాల మేరకు త్వరలో కేంద్రాల నిర్వహణ కోసం టెండర్లు పిలుస్తాం. టెండర్‌లో దక్కించుకున్న వారు క్రీడాకారులకు తగిన ఏర్పాట్లు చేసి ఆటలు ఆడుకునే విధంగా చూస్తారు.

– రాజేశ్వరి, డీఎస్‌డీఓ, ఒంగోలు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. అర్ధరాత్రి నుంచే యువత సందడి చేశారు. కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టారు. వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో నాయకులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ ముఖ్య అతిథులుగా హాజరై నూతన సంవత్సర కేక్‌ కట్‌ చేశారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలతో కార్యాలయం కిక్కిరిసింది. నాయకులు, కార్యకర్తలు బొకేలు, పుష్పగుచ్ఛాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, లిడ్‌క్యాప్‌ మాజీ చైర్మన్‌ కాకుమాను రాజశేఖర్‌, వాణిజయ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్‌, ఒంగోలు నగర అధ్యక్షుడు కటారి శంకర్‌, బీసీ సెల్‌ అధ్యక్షుడు బొట్లా సుబ్బారావు, ఇతర నేతలు పెద్త ఎత్తున పాల్గొన్నారు.

● మార్కాపురంలో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా 700 కేజీల భారీ కేక్‌ను వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, ఒంగోలు పార్లమెంట్‌ ఇన్‌చార్జి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు కట్‌ చేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు అన్ని వేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.

● దర్శిలో వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మలకు శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి తరలివచ్చిన నేతలు, అభిమానులతో దర్శి జనసంద్రంలా మారింది. ఈ సందర్భంగా కార్యకర్తలు జై జగన్‌..జై బూచేపల్లి అంటూ కార్యాలయ ఆవరణ మార్మోగింది.

● యర్రగొండపాలెంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ నివాసం వద్ద కోలాహలం నెలకొంది. నియోజకవర్గ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు అభిమానులు తరలివచ్చి బోకేలు, పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఎమ్మెల్యే తాటిపర్తి అందరినీ ఆప్యాయంగా పలకరించి శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన అభిమానులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ భోజన ఏర్పాట్లు చేశారు.

● గిద్దలూరులో వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డిని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు పార్టీ కార్యాలయానికి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి బోకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

● కనిగిరిలో పార్టీ వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఒంగోలు పార్లమెంట్‌ ఇన్‌చార్జి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కనిగిరి ఇన్‌చార్జి దద్దాల నారాయణ పాల్గొన్నారు. నియోజకవర్గ నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు నడుమ భారీ కేక్‌ను కట్‌ చేశారు. పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావడంతో కార్యాలయ ఆవరణ కిక్కిరిసింది.

● సింగరాయకొండలో పార్టీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచ చేసిన నూతన సంవత్సర వేడుకల్లో వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పాల్గొన్నారు. సురేష్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.

● చీమకుర్తిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మలకు శుభాకాంక్షలు తెలిపేందుకు నేతలు, కార్యకర్తలు పోటీ పడ్డారు. తొలుత బూచేపల్లికమలాకర్‌ పార్కులో కేక్‌ కట్‌ చేసి పంచిపెట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
నవ వసంతరాగం.. 1
1/4

నవ వసంతరాగం..

నవ వసంతరాగం.. 2
2/4

నవ వసంతరాగం..

నవ వసంతరాగం.. 3
3/4

నవ వసంతరాగం..

నవ వసంతరాగం.. 4
4/4

నవ వసంతరాగం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement