గోవింద నామస్మరణతో మార్మోగిన శ్రీగిరి
ఒంగోలు మెట్రో: పుష్యమాసం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీగిరి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం స్థానిక శ్రీగిరి పాదపీఠం వద్ద ఉన్న బాపూజీ గోశాలలో గోపూజ నిర్వహించి వెంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలతో గోవింద నామాలు చదువుతూ గరుడ హనుమాన్ శంకు చక్ర త్రిపుండ్రాలను చేతబట్టి భజంత్రీల మేళతాళాలతో స్థానిక కోర్టు సెంటర్ గ్రంథాలయం, కేశవస్వామిపేట భగీరథ మహర్షి మందిరం, వేప అంకమ్మ తల్లి ఆలయం, శర్మ కాలేజీ క్రికెట్ గ్రౌండ్ మీదుగా గద్దలగుంట రాజా పానగల్ వీధులు దాటి శ్రీగిరి చేరి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షుడు రాధా రమణ గుప్తా జంధ్యం, సహ కార్యదర్శి నేరెళ్ల శ్రీనివాసరావు, సభ్యులు ధనిశెట్టి రామునాయుడు, దోగిపర్తి మల్లికార్జునరావు, స్వామి రాఘవేంద్రరావు, గ్రంధి సుధీర్, బొమ్మిరెడ్డి రాఘవరెడ్డి, తాతా ప్రసాదు తదితర భక్తులు పెద్ద సంఖ్యలో మహిళలు శ్రీగిరి గిరి ప్రదక్షిణ లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment