జిల్లా అభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దాం
● జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ
ఒంగోలు సిటీ: జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేల సహకారంతో జిల్లా అభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దామని జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. పాత జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలోని ఛాంబర్‌లో జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘాల సమావేశం నిర్వహించారు. సమావేశంలో 5వ కమిటీకి మారెడ్డి అరుణ, 6వ కమిటీకి చుండి సుజ్ఞానమ్మ అధ్యక్షత వహించారు. 2వ స్థాయి సంఘంలో గ్రామీణాభివృద్ధి శాఖ విషయాలపై సమీక్ష నిర్వహించారు. వ్యవసాయం, విద్య, వైద్యం, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖలపై సమీక్ష చేశారు. జెడ్పీ సీఈఓ బి.చిరంజీవి నిర్వహణలో జరిగిన సమావేశానికి దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment