పచ్చ సిరాతో
‘‘మీరేం ఇబ్బందిపడొద్దు.. అధికారంలోకి రాగానే ఎయిడెడ్ పాఠశాలలను ఆదుకుంటాం’’ అని సీఎం చంద్రబాబు హామీలు గుప్పించారు. తీరా గద్దెనెక్కాక ఎప్పటిలాగే నాలుక మడతేశారు. వీటి ఊపిరి తీసే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో విద్యా రంగానికి ఎనలేని ప్రాధాన్యత ఇవ్వగా.. అవన్నీ కూటమి ప్రభుత్వంలో కనుమరుగయ్యాయి. తాజాగా ఎయిడెడ్ పాఠశాలలపై కూటమి సర్కారు కత్తిగట్టింది. మొత్తం స్కూళ్లను ప్రైవేటుపరం చేసి కార్పొరేట్లకు దాసోహమయ్యేలా చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment