సర్దుబాటుపై దాటవేత ధోరణి
కొన్ని స్కూళ్లలో పిల్లల నిష్పత్తి కంటే ప్రభుత్వ వేతనంతో పనిచేసే ఉపాధ్యాయుల నిష్పత్తే ఎక్కువగా ఉంది. జిల్లాలో ఎయిడెడ్ ప్రైమరీ, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మొత్తం 132 ఉండగా, ఇందులో మొత్తం 616 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఈ పాఠశాలలో సుమారు 23 వేల మంది పిల్లలు ఉన్నారు. జీరో ఎన్‌రోల్ నమోదైన స్కూళ్లలో 47 మంది టీచర్లు పనిచేస్తున్నారు. వీరు కాక మరో 50 మంది కలిపి మొత్తం 97 మంది మిగులు ఉపాధ్యాయులు ఉన్నారు. దొనకొండ మండలంలోని బాదాపురం ఎయిడెడ్ స్కూల్లో 20 మంది పిల్లలకుగాను ఐదుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం ఎయిడెడ్ హైస్కూల్లో 60 మంది విద్యార్థులకుగాను 17 మంది ఉపాధ్యాయులు, కనిగిరి మండలం ఎల్.ఎం.కె హైస్కూల్లో 50 మందికిగాను 16 మంది టీచర్లు పనిచేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ నివేదికల ద్వారా తెలుస్తోంది. అయితే విద్యార్థులు ఎక్కువగా ఉన్నచోట ఉపాధ్యాయులు లేని పరిస్థితి నెలకొంది. జెడ్పీ, మున్సిపల్ యాజమాన్యాల స్కూళ్లలో సర్‌ప్లస్ ఉపాధ్యాయులకు పని సర్దుబాటు జరిగినా, ఎయిడెడ్‌లో మాత్రం యాజమాన్యాలు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది.
Comments
Please login to add a commentAdd a comment