ఆధునిక పద్ధతులతో రైతులకు లాభాలు
● కలెక్టరు తమీమ్ అన్సారియా
ఒంగోలు అర్బన్: విజ్ఞానం పెంచుకొని ఆధునిక పద్ధతులు అవలంబించడం ద్వారా రైతులు మరింత లాభాలు పొందవచ్చని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహిస్తున్న ఉద్యాన ఉత్సవం–2025 విజ్ఞాన యాత్రలో పాల్గొనేందుకు జిల్లా నుంచి వెళుతున్న రైతుల బస్సును మంగళవారం రాత్రి ప్రకాశం భవనం వద్ద కలెక్టర్ తమీమ్ అన్సారియా జెండా ఊపి సాగనంపారు. ఈ యాత్రలో మొత్తం 70 మంది రైతులు పాల్గొనేందుకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. కలెక్టర్‌తో పాటు జిల్లా ఉద్యాన అధికారి గోపిచంద్, వ్యవసాయ శాఖాధికారి రమేష్, ఆత్మ పీడీ రామ్మోహన్, సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఇతర అధికారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment