ఏపీ ఆర్‌ఎస్‌ఏ అధ్యక్షుడిగా మధుసూదన్
● సెక్రటరీగా వాసుదేవరావు
ఒంగోలు అర్బన్: ఏపీఆర్‌ఎస్‌ఏ (ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్) జిల్లా కార్యవర్గ ఎన్నికలు ఆదివారం రెవెన్యూ భవనంలో నిర్వహించారు. ఎన్నికల కార్యక్రమానికి సీహెచ్ సురేష్‌బాబు, ఎస్‌కే మహబూబ్‌బాష, పెంచల్‌రెడ్డి ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. ఎన్నికల్లో ఎటువంటి పోటీలేకపోవడంతో ఏకగ్రీవంగా జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఏపీఆర్‌ఎస్‌ఏ అధ్యక్షుడిగా కొత్తపట్నం తహశీల్దార్ పిన్నక మధుసూదన్‌రావు ఎన్నికవగా, సెక్రటరీగా నాగులుప్పలపాడు మండల డిప్యూటీ తహశీల్దారుగా ఉన్న ఆర్ వాసుదేవరావు ఎన్నికయ్యారు. అసోసియేట్ ప్రెసిండెంట్‌గా వీ కిరణ్, ఉపాధ్యక్షులుగా ఏ రవిశంకర్, జీ రజనీకుమారి, ఎ వెంకట భార్గవ రాజేష్, కే కాశయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పీఆర్‌ఎస్ శర్మ (రాము), స్పోర్ట్స్ కల్చరల్ సెక్రటరీగా ఎస్ రామనారాయణరెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా కే శాంతి, కేకే కిషోర్ కుమార్, కే అశోక్‌కుమార్, బీవీ సుబ్బారావు, ట్రెజరర్ వీ శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా జే శ్రీనాథ్, ఎస్‌కే షాజహాన్, డీ వెంకటేశ్వరరావు, ఎన్ గోపి, వై ప్రశాంత్‌నాయుడు, పీ మాధవరావు, ఎం చైతన్యప్రకాష్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికై న నాయకులను పలువురు ఉద్యోగులు అభినందించారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికై న కమిటీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు.
వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు
మద్దిపాడు: వ్యక్తి అదృశ్యంపై ఆదివారం మద్దిపాడు పోలీస్‌స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఎస్సై బి.శివరామయ్య తెలిపారు. ఎస్సై శివరామయ్య కథనం ప్రకారం.. టంగుటూరు మండలం కారుమంచికి చెందిన ఆత్మకూరు శ్రీనివాస్ ఒంగోలులో నివాసం ఉంటూ గుండ్లాపల్లి పారిశ్రామికవాడలోని ఎమ్మెస్ గ్రానైట్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. సుమారు 8 నెలల క్రితం ఇంట్లో చెప్పకుండా ఎటో వెళ్లిపోయాడని, ఇప్పటివరకు ఎదురుచూసినప్పటికీ రాలేదని అతని తల్లి ఆత్మకూరి అంజమ్మ ఫిర్యాదు చేసింది. ఆ మేరకు మద్దిపాడు పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment