అమిత్‌షాను బర్తరఫ్ చేయాలి
● వామపక్ష పార్టీ డిమాండ్
ఒంగోలు టౌన్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి షేక్ మాబు డిమాండ్ చేశారు. అమిత్ షా రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని సాగర్ సెంటర్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్‌ను అవమానించిన అమిత్ షాకు ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టే అర్హత లేదని తేల్చి చెప్పారు. ఆయన తక్షణమే రాజీనామా చేసి దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ, జనసేన కూటమికి రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా అమిత్ షాతో బహిరంగ క్షమాపణలు చెప్పించాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోక పోవడం సిగ్గుచేటని సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసి రాష్ట్ర కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు విమర్శించారు. అమిత్ షా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సీపీఐఎంఎల్ నాయకురాలు ఎస్ లలిత కుమారి డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో సీపీఎం, సీపీఐ, సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసి నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment