కష్టజీవుల పక్షపాతి ‘రావులపల్లి’
మార్కాపురం టౌన్: కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నేత, కష్టజీవుల సమస్యల పరిష్కారం కోసం తుది శ్వాస వరకు పోరాడిన రావులపల్లి చెంచయ్య సేవలు మరువలేనివని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎమ్‌ఎల్ నారాయణ కొనియాడారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో చెంచయ్య వర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నారాయణ మాట్లాడుతూ.. పశ్చిమ ప్రకాశంలో తొలితరం కమ్యూనిస్టు పార్టీ నాయకునిగా ముఖ్యంగా వ్యవసాయ కూలీలు, రైతుల సమస్యలపై అకుంటిత దీక్షతో పోరాటాలు చేసిన వ్యక్తి చెంచయ్య అని పేర్కొన్నారు. దివంగత పూలసుబ్బయ్య, గుజ్జుల యలమందారెడ్డి, సానికొమ్ము కాశిరెడ్డి తదితర నాయకులతో కలిసి సమస్యలపై పోరాడారని గుర్తుచేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాఽథ్ మాట్లాడుతూ.. తన తండ్రి ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాటాలు చేస్తున్నామన్నారు. వెలుగొండ ప్రాజెక్టు మిగిలిన పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎన్‌వి రమణ, ఎస్‌కే ఖాశీం, చిత్తారి పెద్దన్న, ఏలూరి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment