జీజీహెచ్ అడ్మినిస్ట్రేటర్‌గా అద్దయ్య
ఒంగోలు టౌన్: ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్‌గా డిప్యూటీ కలెక్టర్ కె. అద్దయ్య మంగళవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన జిల్లా డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చూస్తానని చెప్పారు. హెచ్‌ఓడీలతో సమావేశమై సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. రోగుల ఆరోగ్యంపై వైద్యులు, సిబ్బంది దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో ఆర్‌ఎంఓ మాధవీలత , డిప్యూటీ డైరెక్టర్ మంజుల, అడిషనల్ డైరక్టర్ లక్ష్మీ కుమారి, ఏఓ రమణమ్మ పాల్గొన్నారు. నూతన అడ్మినిస్ట్రేటర్‌ను జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జమున, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండలు కలిసి అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment