ఉత్తమ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డులకు జిల్లా అధిక
ఒంగోలు అర్బన్: ఓటరు నమోదులో ప్రతిభ కనబరిచిన అధికారులకు ఎన్నికల సంఘం అందించే ఉత్తమ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డు–2024కు జిల్లా నుంచి పలువురు అధికారులు ఎంపికయ్యారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఒంగోలు నియోజకవర్గ ఈఆర్‌ఓ కె.లక్ష్మీప్రసన్న, సోషల్ మీడియా అండ్ సైబర్‌సెల్ ఇన్‌స్పెక్టర్ వి.సూర్యనారాయణకు అవార్డులు దక్కాయి. ఈనెల 25వ తేదీన నిర్వహించనున్న 15వ జాతీయ ఓటర్ల దినోత్సవంలో వీరు అవార్డులు అందుకోనున్నారు.
‘నా ప్రాణానికి రక్షణ కల్పించండి’
తర్లుపాడు: టీడీపీ నేతల భూకబ్జాపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఇటీవల ఫిర్యాదు చేశానన్న కోపంతో తనపై దాడి చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మండలంలోని బుడ్డపల్లి గ్రామానికి చెందిన తమ్మిశెట్టి ఏడుకొండలు ఆందోళన వ్యక్తం చేశారు. తన ప్రాణానికి ప్రమాదం పొంచి ఉందని రక్షణ కల్పించాలని గురువారం పోలీసు అధికారులను కోరారు. ఇందుకు సంబంధించిన ఒక లేఖ సోషల్‌మీడియాలో వైరల్ అయింది. టీడీపీ నేతల భూ ఆక్రమణలపై ఫిర్యాదు చేయడం, విచారణ చేపట్టాలని సీఎంవో నుంచి ఆదేశాలు వచ్చినప్పటి నుంచి తనతోపాటు తన కుటుంబ సభ్యులను కూడా బెదిరిస్తున్నారని, తన ప్రాణానికి రక్షణ కల్పించాలని ఆ లేఖలో కోరారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ఏదైనా జరిగితే టీడీపీ నేతలదే బాధ్యత అని ఏడుకొండలు స్పష్టం చేశారు.
ప్రకాశం బాలోత్సవ్ బ్రోచర్ల ఆవిష్కరణ
ఒంగోలు సిటీ: ప్రకాశం బాలోత్సవ్ బ్రోచర్లను, ఎంట్రీ ఫారాలను ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి, డీఈఓ అత్తోట కిరణ్‌కుమార్ గురువారం విడుదల చేసినట్లు బాలోత్సవ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బండారు లక్ష్మీనారాయణ, కె.సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 38 అకడమిక్ అంశాలు, 17 కల్చరల్ అంశాలతో బాలోత్సవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 26వ తేదీలోగా ఎంట్రీ ఫారాలు అన్ని పాఠశాలలకు అందజేస్తామని చెప్పారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఫిబ్రవరి 8వ తేదీలోగా పంపాలని సూచించారు. ఎంట్రీ ఫారాలు వాట్సప్‌లో లేదా వ్యక్తిగతంగా ఎల్బీజీ భవన్ కారాలయంలో అందజేయవచ్చని తెలిపారు. వివరాలకు 9490300412ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపవిద్యాశాఖాధికారులు చంద్రమౌళీశ్వరరావు, శామ్యూల్, ఎంఈఓలు కిషోర్‌బాబు, సరస్వతి, వెంకారెడ్డి, యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొమోజు శ్రీనివాసరావు, ప్రకాశం బాలోత్సవ్ వర్కింగ్ ప్రెసిడెంట్ డి.వీరాంజనేయులు, సభ్యులు చిన్నస్వామి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
27న త్రీ–ఏ సైడ్ జిల్లా వాలీబాల్ క్రీడాకారుల ఎంపిక
టంగుటూరు: త్రీ–ఏ సైడ్ వాలీబాల్ రాష్ట్ర స్థాయి జట్టు ఎంపిక పోటీలు ఈ నెల 27న శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు జూనియర్ కాలేజీలో నిర్వహించనున్నారని జిల్లా అసోసియేషన్ నాయకుడు సురేష్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు 8790 49511ను సంప్రదించాలని సూచించారు. ఒరిజినల్ ఆధార్, బర్త్ సర్టిఫికెట్, 4 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో హాజరు కావాలని తెలిపారు. ఎంపికై న జట్టు ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు హర్యానా రోహ్‌తక్ స్టేడియంలో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment