అర్ధరాత్రి వేళ.. ఎందుకబ్బా?
మార్కాపురం: పట్టణ నడిబొడ్డులో టీటీడీ కల్యాణ మండపం ఎదురుగా ఉన్న అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ భవనాన్ని అధికారులు గురువారం రాత్రి వేళ కూల్చివేశారు. శిథిలావస్థకు చేరిన ఈ భవనాన్ని రాత్రి వేళ మున్సిపల్ అధికారులు కూల్చివేయడం చర్చనీయాంశమైంది. సుమారు 50 ఏళ్లపాటు ఈ భవనంలో వైద్య సిబ్బంది సేవలు అందించారు. గతంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు టీకాలు వేసేవారు. కాలక్రమేణా శిథిలావస్థకు చేరడంతో ప్రస్తుతం ఈ భవనం నిరుపయోగంగా ఉంది. వైద్యారోగ్య శాఖ సిబ్బంది తమ రికార్డులు భద్రపరిచేందుకు ఉపయోగించుకుంటున్నారు. అర్ధరాత్రి కూల్చివేతల కార్యక్రమం చేపట్టడంతో పట్టణ వాసులతోపాటు వ్యాపార వర్గాల్లో మళ్లీ ఆందోళన మొదలైంది.
మార్కాపురంలో పాత అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ కూల్చివేత
Comments
Please login to add a commentAdd a comment