బంధువులు మందలించారని..
మార్కాపురం టౌన్: బంధువులు మందలించారన్న క్షణికావేశంలో ఓ బాలుడు అర్ధంతరంగా తనువు చాలించాడు. ఈ సంఘటన కుటుంబ సభ్యులు మార్కాపురం రూరల్ పోలీసుస్టేషన్ పరిధిలోని గొట్టిపడియ డ్యామ్ వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. మార్కాపురం మండలంలోని జంకె రామిరెడ్డి కాలనీకి చెందిన కన్నెబోయిన ఆంజనేయులు, బాలేశ్వరి దంపతుల కుమారుడు సుబ్బయ్య(16) వైఎస్సార్ జిల్లా ఖాజీపేటలో ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదవుతున్నాడు. కొద్ది రోజులుగా సుబ్బయ్య ప్రవర్తన సరిలేదని ఖాజీపేటలో ఉన్న బంధువులు మందలించారు. దీనిని జీర్ణించుకోలేని ఆ బాలుడు ఎవరికీ చెప్పకుండా ఆర్టీసీ బస్సులో మార్కాపురం మండలం కుంట వద్దకు చేరుకున్నాడు. అదే ఆవేశంలో వెలుగొండ ప్రాజెక్టులో భాగమైన గొట్టిపడియ డ్యామ్‌పైకి చేరుకుని కిందకు దూకాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న రూరల్ ఎస్సై అంకమరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.
పదో తరగతి బాలుడు ఆత్మహత్య
గొట్టిపడియ డ్యామ్‌పై నుంచి దూకిన వైనం
Comments
Please login to add a commentAdd a comment