జీవితం.. చదువుతోనే బంగారుమయం
ఒంగోలు సిటీ: బాలబాలికలు చదువుకుని జీవితంలో అభివృద్ధి పథంలో నడవాలని బాలల సంరక్షణ అధికారులకు ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి ఆకాంక్షించారు. గురువారం ఒంగోలులోని బాల సదన్, శిశుగృహను సందర్శించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా బత్తుల పద్మావతి మాట్లాడుతూ.. చదువుపై ఆసక్తి కలిగిన బాలికలను గుర్తించి కేజీబీవీకి పంపాలని డీఈఓకు సూచించారు. ఇతర జిల్లాలకు చెందిన బాలికలను అక్కడికే పంపడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. ఆధార్ లేని పిల్లల కోసం తగు చర్యలు తీసుకోవాలని పీఓఐసీకి, పిల్లలకు కౌన్సెలింగ్ ఇవ్వాలని డీసీపీయూ కౌన్సిలర్‌కు స్పష్టం చేశారు.
జిల్లా వ్యాప్తంగా తనిఖీల్లో భాగంగా ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. బధిర విద్యార్థులకు తగిన ఆహారం, విద్య అందించాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. బధిర బాలబాలికలకు హెల్త్‌కార్డులు, ప్రత్యేక హెల్ప్‌లైన్ ఉండేలా చూడాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని తెలిపారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని డీఆర్‌ఆర్‌ఎం పాఠశాలలోని బాలికలకు వివిధ అంశాలపై సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ నెల 30, 31వ తేదీల్లో రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో డిపార్ట్‌మెంటల్ రివ్యూ మీటింగ్ నిర్వహించడానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీపీఓ దినేష్‌కుమార్, బాలసదనం సూపరింటెండెంట్ జీవిత, ఇన్‌చార్జ్ హెచ్‌ఎం రాజ్యలక్ష్మి, ఉపాధ్యాయులు రమణ, లీగల్ కం ప్రొబేషన్ ఆపీసర్ రత్నప్రసాద్, సోషల్ వర్కర్ వీరాంజనేయులు పాల్గొన్నారు.
ఏపీ బాలల హక్కుల పరిరక్షణ
కమిషన్ సభ్యురాలు పద్మావతి
Comments
Please login to add a commentAdd a comment