విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాలల విలీనం
ఒంగోలు సిటీ: విద్యార్థుల సంఖ్య ఆధారంగా క్లస్టర్, మండల, జిల్లా స్థాయిలో కమిటీల ద్వారా స్కూళ్లను విలీనం చేస్తామని పాఠశాల విద్యా కమిషనర్ విజయరామరాజు పేర్కొన్నారు. గురువారం స్థానిక ఎం.ఎస్ ఫంక్షన్ హాల్లో నెల్లూరు, ప్రకాశం జిల్లాల ఎంఈఓలు, క్లస్టర్ హెచ్‌ఎంలకు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యా కమిషనర్ మాట్లాడుతూ.. పాఠశాల విద్యను బలోపేతం చేయడం కోసం జీవో 117ను మారుస్తూ మార్గదర్శకాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో 60 పైన విద్యార్థులు ఉన్నచోట మోడల్ స్కూల్ ఏర్పాటు చేసి తరగతికి ఓ ఉపాధ్యాయుడు ఉండేలా చేస్తామన్నారు. ప్రాథమికోన్నత పాఠశాలలో 6,7,8 తరగతుల్లో 60 పైన విద్యార్థులు, మౌలిక వసతులు ఉంటే ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ చేస్తామన్నారు. 30 మంది కంటే తక్కువ ఉంటే ప్రాథమిక పాఠశాలగా మారుస్తామన్నారు. దూరంగా ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో 60 లోపు విద్యార్థులు ఉంటే బేసిక్ ప్రైమరీ స్కూల్‌గా మారుస్తామని, 1,2 వ తరగతులున్న చోట ఫౌండేషన్ స్కూళ్లు ఉంటాయని, అంగన్‌వాడీ సెంటర్లును కూడా ప్రైమరీ స్కూళ్లలో కలిపి పీపీ1, పీపీ2, క్లాసులుగా చేరుస్తామన్నారు. వర్క్‌షాపులో కలెక్టర్ తమీమ్ అన్సారియా, గుంటూరు ఆర్జేడీ, డీఈవోలు, ఉపవిద్యాశాఖాధికారులు, ఎంఈఓలు, క్లస్టర్ల హెచ్‌ఎంలు పాల్గొన్నారు.
పాఠశాల విద్యా కమిషనర్
విజయరామరాజు
Comments
Please login to add a commentAdd a comment