జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ అధ్యక్షునిగా శ్రీకాంత్
సింగరాయకొండ: ప్రకాశం జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఒంగోలుకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు కే శ్రీకాంత్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. స్థానిక ఏఆర్‌సీ అండ్ జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజి ఆవరణలో ఆదివారం ప్రకాశం జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎంపిక నిర్వహించారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షునిగా ప్రధానోపాధ్యాయుడు వాకా వెంకటేశ్వర్లు, కార్యదర్శిగా ఎన్‌టీ ప్రసాద్, కోశాధికారిగా పీడీ కందికట్ల శంకరరావును ఎంపిక చేశారు.
ఏపీజేఏసీ అమరావతి జిల్లా శాఖ చైర్మన్‌గా మధు
ఒంగోలు అర్బన్: ఏపీజేఏసీ అమరావతి జిల్లా శాఖ చైర్మన్‌గా పిన్నిక మధుసూదన్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక రెవెన్యూ భవనంలో ఏపీజేఏసీ జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించి మధును ఎన్నుకున్నారు. ఇప్పటికే ఆయన ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడుగా కూడా ఉన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ అసోసియేషన్ నాయకులు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. కార్యవర్గం సమావేశంలో అసోసియేట్ ప్రెసిడెంట్ వేణుగోపాల్‌రెడ్డి, జనరల్ సెక్రటరీ కందుల వెంకటేశ్వర్లు, మహిళా ఛైర్ పర్సన్ విజయలక్ష్మి, రెవిన్యూ అసోసియేషన్ సెక్రటరీ వాసుదేవరావు, ట్రెజరర్ ఊతకోలు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment