కొలనూర్‌లో ఓటుహక్కు వినియోగించుకుంటున్న వికలాంగులు
● పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కుమారస్వామి
సిరిసిల్లటౌన్: ప్రజల ఓట్లతో గెలిచి సమస్యల పరిష్కారంలో పట్టింపులేకుండా ఉంటున్న రాజకీయ నాయకులు ఓట్ల కోసం వస్తే ప్రశ్నించండని పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి కోరారు. ‘ఓట్ల కోసం వచ్చే వారిని ప్రశ్నించండి’ అనే నినాదంతో సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన
ముద్రించిన కరపత్రాలను గురువారం ఆవిష్కరించి మాట్లాడారు. పదేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాసమస్యలను గాలికొదిలేసి వారి లబ్ధికే పాటుపడ్డాయన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణంలో లక్షలాది కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ఆరోపించారు. అవినీతి నాయకులను ఇంటికి పంపించాలని కోరారు. ఈ కార్యక్రజుమంలో నార వినోద్, గడ్డం సంజీవ్‌కుమార్, బాలసాని రాజయ్య, మార్వాడి సుదర్శన్, మేకల కమలాకర్, దర్శనం కిషన్ తదితరులు పాల్గొన్నారు.
ఇంటి వద్దే ఓటుహక్కు వినియోగం
కోనరావుపేట(వేములవాడ): అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని కొలనూర్, గొల్లపల్లి గ్రామాల్లో ఇంటి వద్దనే ఓటు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల పరిశీలకులు అనిల్ చౌహాన్, ప్రిసైడింగ్ అధికారి కాసుల రవీందర్ దివ్యాంగుల ఇంటికి వెళ్లి ఓటుహక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నారు. కొలనూర్‌లో 8 మంది, గొల్లపల్లిలో నలుగురు ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ దివ్యాంగులకు ఎన్నికల సంఘం కల్పించిన అవకాశాన్ని వనియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా హోమ్ ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటికి వెళ్లి ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. బూత్‌లెవల్ అధికారి మల్లీశ్వరి తదితరులు ఉన్నారు.
అలా వెళ్లారు.. ఇలా వచ్చారు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఎన్నికల వేళ నాయకుల పార్టీ ఫిరాయింపులు మరోసారి చర్చకు వచ్చా యి. ఇలా వెళ్తూ.. అలా తిరిగొస్తున్నారు. ఎవ రూ ఎప్పుడు ఏ పార్టీ కండువా కప్పుకుంటు న్నారో అయోమయంగా మారింది. మండల స్థాయి నాయకులు ఇలా జెండాలు మార్చు తుంటే.. ఈ విషయమై ప్రజల్లో చర్చలు జో రుగా సాగుతున్నాయి. తంగళ్లపల్లి మండల బీ జేపీ అధ్యక్షుడు సురువు వెంకట్‌తోపాటు బీజేవైఎం మండలాధ్యక్షుడు కోల ఆంజనేయులు ఇటీవల కమలానికి టాటా చెప్పి కారెక్కారు. వెళ్లి వారం కూడా కాకుండా కారులోంచి దూకి కమలాన్ని పట్టుకున్నారు. గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ సమక్షంలో కాశాయం కండువా కప్పుకున్నారు.
బైండోవర్ ఉల్లంఘించిన వ్యక్తికి జరిమానా
సిరిసిల్లక్రైం: సత్ప్రవర్తన కోసం బైండోవర్ చేసిన వ్యక్తి నిబంధనలు ఉల్లంఘించడంతో రూ.30 వేల జరిమానా విధించినట్లు సిరిసిల్ల డీఎస్పీ ఉదయ్‌రెడ్డి గురువారం తెలిపారు. ఇల్లంతకుంట మండలం కందికట్కూర్‌కు చెందిన రంగు శ్రీనివాస్, అనంతారం గ్రామానికి చెందిన తీగల కనకయ్యలకు ఒక్కొక్కరికి రూ.30వేల చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు. వీరిద్దరు బెల్టుషాపులో మద్యం విక్రయించారని, వారిలో మార్పు కోసం బైండోవర్ చేశామన్నారు. బైండోవరైన వ్యక్తులు కనీసం ఆరు నెలలు నేరాలు చేయకుండా ఉండాలని బంధనలున్నాయని, వాటిని పాటించాలని డీఎస్పీ ఉదయ్‌రెడ్డి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment