మాస్టర్ అథ్లెటిక్స్‌లో క్రీడాకారుల ప్రతిభ
సిరిసిల్లటౌన్: జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటారు. హైదరాబాద్‌లో ఈనెల 4, 5 తేదీలలో జరిగిన 11వ నేషనల్ మాస్టర్ అథ్లెటిక్ స్టేట్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న 8 మంది క్రీడాకారులు రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, ఎనిమిది కాంస్య పతకాలు సాధించారు. వీరిని జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సంగ స్వామి, చింతలపల్లి మునీందర్‌రెడ్డి అభినందించారు. పురుషులలో 10 కి.మీ. రన్నింగ్‌లో కె.అశోక్(తృతీయ), లాంగ్‌జంప్‌లో జె.మహేందర్(తృతీయ), జి.రామచంద్రం(తృతీయ), వాకింగ్‌లో జి.భాస్కర్‌రెడ్డి(తృతీయ), లాంగ్‌జంప్‌లో జి.సత్యనారాయణరెడ్డి(తృతీయ) స్థానాల్లో నిలిచారు. మహిళలల్లో.. 5 కి.మీ వాకింగ్‌లో ఎం.లావణ్య(ప్రథమ), 800 మీటర్లలో బి.బాహాటే బేలా(ద్వితీయ), 5 కి.మీ తృతీ య, 1500 మీటర్ల రన్నింగ్‌లో ప్రథమ స్థానాల్లో నిలిచారు. 800 మీటర్ల రన్నింగ్‌లో ఎం.లక్ష్మి(తృతీయ), 1500 మీటర్ల రన్నింగ్‌లో ద్వితీయ స్థానాల్లో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment