మా భూమిని ఇతరులు సాగు చేస్తుండ్రు
నాకు తాడూరు శివారులో 34 గుంటల భూమి ఉంది. గ్రామానికి చెందిన కొందరు నా స్థలంలోకి వచ్చి సాగుచేస్తుండ్రు. ప్రశ్నిస్తే ఇబ్బందులకు గురిచేస్తుండ్రు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
– సాప కమల, తాడూరు
నష్టపరిహారం ఇవ్వలేదు
మా ఊరిలో నాకు ఎకరం భూమి ఉంది. భర్త మూడేళ్ల క్రితం పాముకాటుతో చనిపోయిండు. అప్పటి నుంచి నా భూమిలో పత్తి వేసి ఇద్దరు ఆడపిల్లలను సాదుకుంటున్న. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల కోసం కందకాలు తవ్వారు. రైతువేదికను నిర్మించారు. నా భర్త ఉన్నప్పుడు స్థలం బదులు స్థలంతోపాటు నష్టపరిహారం ఇస్తామన్నారు. ఇప్పటికీ నష్టపరిహారం అందలేదు. కందకాలు తవ్వినవాళ్లపై చర్యలు తీసుకోవాలి.
– గాదెం సరవ్వ, మారుపాక
Comments
Please login to add a commentAdd a comment